//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చిరు, పవన్ లను చూసి భయపడుతున్న... యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకో తెలుసా....?

Category : state politics movies

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ స్థాపన... ఆ పార్టీ కి ప్రజలతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడడం కోసమే నాడు అన్నగారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అనుకున్నదే తడవుగా పార్టీని స్థాపించి న 9 నెలల లోపే ఆ పార్టీి నీ అధికారంలోకి తీసుకొచ్చి రాజకీయాల్లో తిరుగు లేని శక్తి గా మలిచారు. ఇందంత గతం ఇపుడు నిజం. మొన్నటి ఎన్నికల వరకు ఏపీ లో ఆ పార్టీదే పై చేయి.కానీ మొన్నటి ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ భవిషత్తు మరింత ప్రశ్నార్థకంగా మారింది. ముందు ముందు భవిషత్తు లో ఆ పార్టీని ముందుండి నడిపించే సమర్థుడైన నాయకుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.ప్రస్తుత పరిస్థుతులలో తెలుగుదేశం పార్టీని రక్షించగల ఏకైక శక్తి ఎవరైనా ఉన్నారా అంటే....ప్రతి ఒక్కరి చూపు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ పైనే ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ట్విట్ చేసి వైరల్ గా మారారు.

ఇదే అభిప్రాయం ఒక్క వర్మలోనే కాకుండా తెలుగుదేశం పార్టీ వర్గాలలోను ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విషయం పై ఆ పార్టీ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. తమ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలి అంటూ వేల సంఖ్యలో జూనియర్ కు మెసేజ్ లు పెడుతున్నట్లు తెలుస్తోంది.ఈ అనూహ్య స్పందన చూసి జూనియర్ సన్నిహితులు కూడ ఆనంద పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలు తప్ప మరే విషయం పట్టించుకోనని జూనియర్ పైకి అంటున్నా లోలోపల ఈ అనూహ్య స్పందన అతడిలో కూడ ఆశలు రగిల్చే అవకాసం ఉందని అంటున్నారు. కానీ ఒక్క పరిణామం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలో ఇబ్బంది పెడుతున్న అంశం.అదేమిటి అంటే 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ స్థాపించి ప్రజల తో మమేక మై ఈ సారి ఎన్నికలలో తన దైన మార్క్ చూపిస్తాడు అని అనుకున్న పవన్ ఈ ఎన్నికలలో ఘోర పరాభవం చవి చూడవలసి వచ్చింది.

ప్రస్తుతం ఇదే భయం జూనియర్ ఎన్టీఆర్ మనసులో కూడా ఉన్నట్టు అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న డైలమాలో ఉన్నట్టు సమాచారం. పవన్ కి జరిగినట్టే తనకు కూడా భవిష్యత్తులో జరగదని గ్యారెంటీ ఏమిటని తనను తాను ప్రశ్నించుకుంటున్నారట. సినిమాల్లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి వారి విషయంలో జరిగిన పనే తన రాజకీయ నేపధ్యంలో జరిగితే పరిస్థితి ఏమిటన్నది ఆయన బుర్రను తోలచుతున్న ప్రశ్న. ఇలాంటి పరిస్థుతులలో 2024కు కనీసం 45 సంవత్సరాలు కూడ నిండని జూనియర్ రాజకీయాలలో ఏటువంటి సాహసోపే మైన నిర్ణయం తీసుకుంటాడు అన్నదే అందరిలో ఆసక్తిని కలిగించే అంశం. ఒక వేళ ఇపుడు కాక పోతే తారక్ రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడు అన్నది మరో ప్రశ్న.ఈ నేపధ్యంలో తారక్ ఏ నిర్ణయం తీసుకుంటా డో చూడాలి మరి.