దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో గురువారం భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.