సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్బుక్ కు చెందిన సర్వీసులకు బుధవారం(జులై-3,2019)రాత్రి కొన్ని గంటలపాటు అంతరాయం ఏర్పడింది. భారత్తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఫేస్బుక్ తోపాటు వాట్సాప్, ఇన్స్టాగ్రాం సేవలు వినియోగదారులకు సరిగ్గా లభించలేదు. ఆయా సైట్లు, యాప్లు ఓపెన్ అవుతున్నప్పటికీ వాటిలో ఇమేజ్లు, వీడియోలు ఓపెన్ కావడం లేదని పెద్ద ఎత్తున యూజర్లు ఫిర్యాదు
చేశారు.యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది.రాత్రి 8.30 గంటల సమయం నుంచి భారత్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల అంతరాయం తర్వాత తిరిగి యధావిధిగా ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రాం,వాట్సాప్ సేవలు అందుబాబులోకి వచ్చాయి.అయితే సేవల అంతరాయానికి సాఫ్ట్వేర్ లోపమా, లేదా సర్వర్ సమస్యా అన్నది తెలియలేదు.నెటిజన్లకు కలిగిన అసౌకర్యానికి ఫేస్ బుక్ క్షమాపణలు కోరింది.