//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి "వెంకీ మామ"...!

Category : movies

వెంకటేష్ – నాగచైతన్య కాంబినేషన్ లో, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ 'వెంకీ మామ'. కాగా రామోజీ ఫిలిమ్‌ సిటీలో వెంకటేశ్, పాయల్ రాజ్‌పుత్ మధ్య పాటను చిత్రీకరిస్తుండగా, డ్యాన్స్ చేస్తున్నప్పుడు వెంకటేశ్ కాలు స్వల్పంగా గాయపడటంతో ఈ సినిమా షూటింగ్‌ ను మధ్యలో ఆపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల మొదటివారంలో తిరిగిప్రారంభం కానుందని తెలుస్తోంది. అలాగే, గతంలో "ప్రేమమ్" సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. ఇక దీంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది.

ఈ చిత్రంలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా, నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఇటివలే చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో వెంకీ – చైతు లుక్స్ అండ్ మ్యానరిజమ్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా పై మొత్తానికి ఈ వీడియో బాగానే అంచనాలు పెంచింది. ఇకపొతే ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ చెబుతున్నారు.