Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయ్ దేవరకొండ వచ్చాడంటే ఆ సినిమా ఫట్ హే నట..ఎందుకో తెలుసా..?

Category : movies

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నన్ని సెంటిమెంట్లు ఇంకే ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక సినిమా హిట్ నీ, పట్ నీ జడ్జ్ చేసే స్థాయికి ఎదిగింది అంటేనే అర్థం అవుతుంది. ఈ లెక్కన సినీరంగం అంటేనే సెంటిమెంట్లకు పెద్ద పీట అని చెప్పవచ్చు. ఓ సినిమా సక్సస్ అవ్వాలన్నా.. ఫ్లాప్ కావాలన్నా చాలా ఫ్యాక్టర్స్ దాని కి హెల్ప్ చేస్తాయి. 24 క్రాఫ్ట్స్ సరిగ్గా పని చేస్తేనే ఓ సినిమా హిట్. ఒక్కోసారి ఎంత కష్టపడి పని చేసిన ఆ సినిమా ను ప్రేక్షకులు ఆదరించరు. అందుకే సినీరంగంలో సెంటిమెంట్లను ఎక్కువ గా నమ్ముతారు. తాజాగా ఇదే విషయాన్ని లెక్కలోకి తీసుకొస్తూ యంగ్ హీరో రాకని అపశకునం లా భావిస్తున్నారు.ఆ యంగ్ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ. ఇంతకీ ఏం జరిగింది...విజయ్ నీ ఎందుకు అంత బ్యాడ్ చేయడం అని అనుకుంటున్నారా..! అక్కడి కే వస్తున్న.! అసలు విషయం ఏమిటి అంటే..! తాజాగా విజయ్ దేవరకొండ ఇలాంటి ఓ సెంటిమెంటే కే బలై పోతున్నాడు. అందేంటంటే.. ఏదైనా సినిమా ఫంక్షన్‌కు విజయ్ దేవరకొండ అతిథిగా వస్తే ఆ సినిమా ఫట్టేనట. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ప్రచారంలోకి తెస్తున్నారు కొందరు సినిమా పండితులు...

అక్కినేని కధానాయకుడు నాగచైతన్య 'సవ్యసాచి' ప్రీ రిలీజ్‌ వేడుకకు విజయ్ దేవరకొండ ఓ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆయన రావడం ఆ సినిమా ఫ్లాప్ కావడం... మైత్రీ మూవీ మేకర్స్ కెరీర్‌లోనే ఫస్ట్ ఫ్లాప్‌గా ఆ సినిమా నిలిచింది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ కొమాకుల హీరోగా నటించిన తాజా చిత్రం 'నువ్వు తోపురా' ట్రైలర్ లాంచ్‌కి కూడా విజయ్ దేవరకొండ ఓ గెస్ట్‌. ఆ సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. నిహారికా కొణిదెల 'సూర్యకాంతం' ప్రీ రిలీజ్‌ వేదికకు సైతం విజయ్ దేవరకొండ ముఖ్య అతిథి. అదీ ఫట్టే....! తాజాగా మహేష్ బాబు 'మహర్షి' ప్రీ రిలీజ్‌కి వెంకటేష్ ముఖ్య అతిథిగా వస్తే... విజయ్ దేవరకొండ కూడా మరో ప్రధాన అతిథిగా వచ్చాడు. అందుకే ఈ సినిమా కూడా అంతగా ఆడటంలేదంటున్నారు కొందరు సినిమా పండితులు. కానీ.. సినిమాతో సంబంధం లేకుండా పాపం.. గెస్ట్ గా వచ్చినందుకు కూడా విజయ్ దేవరకొండ నీ బలి చేయడం అనేది. ఆయన అభిమానులకు మింగుడు పడని చేదు నిజం.అందుకే ఇకపై విజయ్ కూడా ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడట.

Related News