Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో కొత్త ఛానెల్ మొదలు పెట్టబోతున్న టీవీ-9 మాజీ సీ.ఈ.ఓ రవి ప్రకాష్.....!

Category : state politics business

తెలుగు న్యూస్ చానెళ్లలో సరి కొత్త ఒరవడి కి నాంది గా... మీడియా రంగంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టీవీ-9 సీ.ఈ.ఓ రవి ప్రకాష్.ఆ ఛానెల్ అభివృద్ది లో కీలక పాత్ర పోషించారు. కానీ టివి-9 యాజమాన్యంలో తలెత్తిన పలు సమస్యల కారణంగా ఆయన ఆ ఛానెల్ నుంచి వైదొలగ వలసిన ఆవశ్యకత ఏర్పడినది .ఈ నేపధ్యంలోనే టీవీ నైన్ నుంచి బలవంతంగా నిష్క్రమించిన రవిప్రకాశ్ మరో కొత్త ఛానల్‌ తో సంచలనం సృష్టించబోతున్నారా.? లేదా అన్నది .? ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయినది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన త్వరలోనే ఓ కొత్త ఛానల్ నీ ప్రారంభించచబోతున్నారా.! అంటే అవుననే మాటే వినిపిస్తుంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా తెలిపారు. ఓ సాధారణ జర్నలిస్టునైన తాను.. టీవీ 9ఛానల్‌ ను అసాధ్యమైన రీతిలో తీర్చిదిద్దాననీ.ఇంతగా శ్రమించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఛానెల్ లో తాను ఇప్పటికీ షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నానని రవిప్రకాశ్ చెప్పుకొచ్చారు. అయితే యాజమాన్యం మారిన వేళ.. తనకు షో నిర్వహించే వీలు లేకపోవచ్చని ఆయన అనుమానం కూడా వ్యక్తం చేశారు.

తనకు టీవీ-9 లో స్థానం లేకపోతే.. మరో చానల్ ప్రారంభించి, మొదటి నుంచి అభివృద్ధి చేస్తానని కూడా స్పష్టం చేశారు. రవిప్రకాశ్‌ కు ఇప్పటికే మోజో టీవీని ప్రారంభించి, అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని వెబ్ సైట్లు కూడా రవిప్రకాశ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడికి చెందిన ఐ న్యూస్ ను రవిప్రకాశ్ టేకోవర్ చేస్తారని కూడా అనేక వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో ఏదో ఒకదాన్ని రవిప్రకాశ్ అభివృద్ధి చేస్తారా.....? లేక కొత్తగా మరో చానల్ పెడతారా...? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి అన్న. ముందు ఫోర్జరీ కేసులో నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా వీలైనంత త్వరగా ఈ కేసు నుంచి బయట పడాలి .