Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రవి ప్రకాష్ అరెస్ట్ కు రంగం సిద్ధం...

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తెలియచేసింది .రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది సైబర్ క్రైమ్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమని రావి ప్రకాష్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. సంతకం ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాష్ కు సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేసారు.

రవి ప్రకాష్ స్పందించలేదు గడువుతేదీ ముగియడంతో రవి ప్రకాష్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా రావడం వల్ల సైబర్ క్రైమ్ పోలీసులు ముందు రవిప్రకాష్ విచారణకు హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వాస్తవానికి సోమవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. గడువు తేదీ దాటిపోవడంతో రవిప్రకాష్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ రావి ప్రకాష్ ఎక్కడ ఉన్నారు అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు . కొందరు ఏపీ లో ఉన్నారని కొందరు ముంబైకి వెళ్లిపోయారని ఆయన తన ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంది అని కుటుంబ సభ్యులు స్నేహితులు తమకు తెలియదని చెప్పారు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సినీ నటుడు శివాజీ కూడా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

Related News