//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాప్ హీరోయిన్ రేస్ దూసుకుపోతున్న రష్మిక మందాన ఫిల్మ్ జర్నీ...ప్రిన్స్ మూవీ లక్కీ ఛాన్స్ వెనుక అసలు కారణం...!

Category : movies

ఒకప్పుడు సౌత్ సినిమాలలో హీరోయిన్స్ గా నటించాలి అంటే పక్కా నార్త్ నుంచి రావలసిందే.ఎందుకంటే నార్త్ హీరోయిన్స్ అయితే అందం, అభినయం తో పాటు విచ్చల విడి అందాల ఆరబోతకు సైతం సిద్దంగా ఉంటారు కనుక.కానీ రోజులు మారాయి.హీరోయిన్స్ అంటే ఇలానే ఉండాలి.ఇక్కడ చూపించాలి అక్కడ చుపించ కూడదు అనే లెక్కలను పక్కన పెట్టి .ఇప్పుడు హీరోయిన్ గా నటించాలి అంటే మాత్రం అందం, అభినయం,కాస్త మసాలా దట్టిస్తే సరిపోతుంది అనే స్టేజ్ కి వెళ్లి పోయింది.ఇలాంటి నేపధ్యంలో ఓ కన్నడ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన రష్మిక మందనా.తాను నటించిన మొదటి కన్నడ సినిమా కిరిక్ పార్టీ తోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన ఈ అమ్మడు .అంత‌కు ముందు క‌న్న‌డ‌, తెలుగు సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా స్కోప్ రాలేదు. కానీ విజ‌య దేవ‌ర‌కొండతో క‌లిసి న‌టించిన గీత గోవిందం సినిమాతో సౌత్ లో టాప్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేసింది.

గీత గోవిందం సినిమా తో ప్ర‌తి తెలుగు కుటుంబంలో మ‌నింటి అమ్మాయే అనుకునేంత‌లా క‌నెక్ట్ అయ్యింది. అలా అన‌డం కంటే ద‌ర్శ‌కుడు ఆమె పాత్ర‌ను అలా మ‌లిచాడు అంటే బాగుంటుంది. స‌ర‌దాగా సాగుతూనే ఉదాత్త‌మైన ప్రేమ‌కు గొప్ప‌నైన ముగింపు ఇచ్చాడు. ఈ మూవీలో ర‌ష్మికా చాలా ఈజీగా ఎక్క‌డా ఇబ్బంది పడకుండా ఆ పాత్ర‌కు సరైన న్యాయం చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ , డైలాగ్స్ , స్టోరీ ఇలా ఒకటా రెండా అన్ని క్రాఫ్ట్స్ సరైన పాళ్లలో ఈ సినిమాకు పుష్కలంగా అందించడంతో ఈ సినిమాకి జనాలు బ్రమ్మరధం పట్టారు .ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు హీరోల చుట్టూ తిరిగే కథలు కాస్త ఇప్పుడు హీరోయిన్స్ చుట్టూ తిరుగుతూ ఉండడం. ఆ సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఉండడం విశేషం. ఇక హీరోయిన్ రష్మిక మందాన ఫిల్మ్ గ్రాఫ్ ఒక్క సారి చూసుకుంటే....

క‌ర్ణాట‌క‌లోని ఓ మారుమూలన 5 ఏప్రిల్ 1996లో జ‌న్మించిన ర‌ష్మికా. మోడ‌ల్‌గా, న‌టిగా క‌న్న‌డ‌, తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. 2016లో విడుద‌లైన " కిరిక్ పార్టీ " సినిమాతో మొట్ట మొదటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ అందుకుంది . దీంతో సౌత్ ఇండియాలోనే ఒక్క‌సారిగా స్టార్ డ‌మ్ వచ్చి పడింది. బెంగ‌ళూరు టైమ్స్ ప‌త్రిక‌..2017లో మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ పేరుతో 30 మంది జాబితా విడుద‌ల చేసింది. అందులో టాప్‌లో రష్మిక మందాన నిలిచారు. 100 కోట్ల క్ల‌బ్‌లో త‌క్కువ స‌మ‌యంలో ఆమె చేరిపోయారు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా 2018లో తెర‌కెక్కిన ' చ‌లో ' సినిమాతో మొద‌టిసారి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఆమె . ఈ సినిమా మరో సూప‌ర్ హిట్ అందుకున్నాడు. అలాగే అదే ఏడాది విడుద‌లైన గీత గోవిందం తో ఆల్ టైం హిట్ ని సొంతం చేసుకున్నారు. త‌క్కువ పెట్టుబ‌డితో తీసిన ఈ సినిమా ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది.ఆ తరువాత అంజ‌నీ పుత్ర‌, చ‌మ‌క్, య‌జమానా సినిమాల్లో రష్మిక న‌టించింది.

ఈమె విద్యా అర్హత విషయానికి వస్తే ....మైసూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామ‌ర్స్‌లో ప్రీ యూనివ‌ర్శిటీ కోర్స్ చేసింది. సైకాల‌జీలో డిగ్రీ, జ‌ర్న‌లిజం అండ్ ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్ లో ఎంఎస్ రామ‌య్య కాలేజీలో పూర్తి చేశారు. కొన్ని ప్ర‌క‌ట‌న‌ల్లో మోడ‌ల్‌గా న‌టించారు. అంతే కాకుండా ఆమె నటించిన మొదటి కన్నడ సినిమా కీరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టి తోనే లవ్ లో పడి సంచలనం క్రియేట్ చేసిన ఈ భామ.ఆ తరువాత ర‌క్షిత్ శెట్టి తో 3 జూలై 2017లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది .ఎందుకో ఏమో ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య తేడా లు రావడంతో సెప్టెంబ‌ర్ 2018లో పెళ్లి చేసుకోవ‌డం లేదంటూ ప్ర‌క‌టించారు. 2012 నుండి ర‌ష్మికా మోడ‌లింగ్ స్టార్ట్ చేశారు. క్లీన్ అండ్ క్లియ‌ర్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నారు. 2013లో టీవీసీ టాప్ మోడ‌ల్ హంట్‌గా నిలిచారు. 19 ఏళ్ల వ‌య‌సులోనే షార్ట్ ఫిలిం ద్వారా త‌న కెరీర్ ప్రారంభించారు. కిరిక్ పార్టీ సినిమాలో న‌టించ‌డంతో ఒక్క‌సారిగా ర‌ష్మికా వెలుగులోకి వ‌చ్చారు. 50 కోట్లు క‌లెక్ట్ చేసింది ఆ సినిమా 4 కోట్లు పెట్టి ఈ సినిమా తీశారు. క‌ర్ణాట‌క‌లోని మెయిన్ సెంట‌ర్ల‌లో 150 రోజులు ఆడింది ఈ సినిమా. షాన్వి పాత్ర‌లో ర‌ష్మిక అపూర్వ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. సిమా అవార్డును ద‌క్కించుకున్నారు.

2017లో హ‌ర్ష‌తో క‌లిసి అంజ‌నీ పుత్ర లో న‌టించారు. ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా బాక్సాఫిస్ సాధించింది. ఆ త‌ర్వాత చ‌మ‌క్ క‌న్న‌డ మూవీలో న‌టించారు. అనంత‌రం తెలుగు సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. నాగ శౌర్య‌తో క‌లిసి న‌టించిన ఈ మూవీ అన్ని చోట్లా అద్భుత‌మైన టాక్ తెచ్చుకుంది. భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ త‌ర్వాతి సినిమా గీత గోవిందం 130 కోట్లు రాబ‌ట్టింది. ఇందులో ప్ర‌ధాన పాత్ర ర‌ష్మిక మందాన‌దే. సో ఆ ఒక్క సినిమా హిట్‌తో ఆమె కెరీర్ రూప‌మే మారి పోయింది. అందంతో పాటు అభిన‌యం కూడా అల‌వ‌ర్చుకున్న ఈ సోగ‌క‌ళ్ల సుంద‌రి ఇపుడు సౌత్ ఇండియాలో టాప్ వ‌న్ హీరోయిన్‌గా వెలిగి పోతుంది. ఇక తాజాగా ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరో గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో తీయ‌బోయే సినిమాకు ఆమె సెలెక్ట్ అయింద‌ని స‌మాచారం. ఇదే క‌నుక క‌న్ఫ‌ర్మ్ అయితే ర‌ష్మిక త‌క్కువ టైంలోనే జాక్ పాట్ కొట్టేసిన‌ట్టే అని సినీ వర్గాల టాక్.