Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

22న ఉప్పల్ లో శిల్పారామం ప్రారంభం

Category : editorial business

భాగ్యనగర ప్రజలకు పల్లె అందాలను, మరియు అనుభూతిని పంచేందుకు మరొక శిల్పారామం కూడా సిద్ధమయింది.హస్తకళలు,చేనేత వస్త్రాలకు నిలయంగా ఉప్పల్ లోని భగాయత్ లే అవుట్‌లో ఏర్పాటుచేసిన మినీ శిల్పారామం ఈ నెల 22న ప్రారంభం కానుంది.ఈ మేరకు హెచ్‌ఎండీఏ,శిల్పారామం విభాగాల అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు మహమూద్‌అలీ,తలసాని శ్రీనివాస్‌యాదవ్,వీ శ్రీనివాస్‌గౌడ్ దీనిని ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటుచేస్తున్నారు.

హెచ్‌ఎండీఏకు చెందిన ఉప్పల్ భగాయత్‌లోని ఏడున్నర ఎకరాల స్థలంలో దాదాపు ఐదు కోట్లతో ఈ మినీ శిల్పారామాన్ని నిర్మించారు.మాదాపూర్‌లో ఉన్న శిల్పారామం తరహాలోనే ఇక్కడ హస్తకళలు,చేనేత వస్త్రాల కోసం 50 స్టాళ్లను ఏర్పాటుచేశారు.మరియు అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్,పెద్దలు సేదతీరడానికి పచ్చని మైదానం,చూపరులను ఆకట్టుకొనే రీతిలో శిల్పారామం యొక్క ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటుచేశారు.దీనికి ఎదురుగా ఒక ఫౌంటేన్‌ను కూడా నిర్మించారు.విభిన్న రుచులతో ఫుడ్‌కోర్టు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పెద్ద యాంఫీ థియేటర్‌ను సిద్ధం చేశారు.వెదురు బొంగులతో నిర్మించిన స్టాళ్లు చూపరులను ఆకట్టుకొంటున్నాయి.