Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"సరిలేరు నీకెవ్వరు"లో అదే హైలైట్ ?

Category : movies

అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న "సరిలేరు నీకెవ్వరు" మూవీలో సగటు ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకునే కామెడీ సన్నివేశాలు ఉండే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ ను ఈ మూవీ పై వేయబోతున్నాడు.ఈ నేపధ్యంలో ఈ సినిమాలో అత్యంత కీలకంగా ఉండబోయే రైలు కామెడీ సీన్ గురించి ఇప్పటికే కొన్ని లీకులు వచ్చాయి.దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో శ్రీనువైట్ల దగ్గర సహాయకుడుగా పనిచేసిన రోజులలో శ్రీనువైట్ల తీసిన వెంకీ సినిమాలోని ట్రైన్ కామెడీ సీన్ ను మళ్ళీ "సరిలేరు నీకెవ్వరు"

సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి రిపీట్ చేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.తెలిసిన సమాచారం మేరకు కాశ్మీర్ లో మిలటరీ మేజర్ గా పనిచేసే హీరో ఆంధ్రాకు ట్రైన్ లో బయలుదేరుతాడు.ఆ సందర్భంగానే ఈ కామెడీ సీన్లు ఉంటాయట.కాశ్మీర్ నుంచి ఆంధ్రా వరకు ట్రైన్ జర్నీ అంటే చాలా టైమ్ పడుతుంది కాబట్టి ఈ సీన్ చాలా పెద్దదిగా ఈమూవీ ఫస్ట్ ఆఫ్ లో వస్తుందని సమాచారం.ఈ ట్రైన్ ఎపిసోడ్ లోనే బండ్ల గణేష్ తో పాటు పలువురు ప్రముఖ కమెడియన్స్ ఈ కామెడీ సీన్ లో నటించబోతున్నట్లు

తెలుస్తోంది.అయితే ఈ సీన్ కోసం సుమారు పది రోజుల సమయం పడుతుంది కాబట్టి అన్ని రోజులు నిజమైన ట్రైన్ ను అద్దెకు తీసుకోవడం చాలా కష్టం అని భావించి అన్నపూర్ణ స్టూడియోస్ లో దీనికోసం ప్రత్యేకమైన ట్రైన్ సెట్ వేస్తున్నట్లు సమాచారం.ఈ ట్రైన్ సెట్ కోసం భారీ బడ్జెట్ కూడా పెడుతున్నట్లు టాక్.అయితే ఇప్పటికే అనేక మంది అనేక సార్లు "వెంకీ" సినిమాలోని ఆ ట్రైన్ కామెడీని బుల్లితెరపై పలుసార్లు వస్తున్నప్పుడు ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ అదే సీన్స్ అనీల్ రావిపూడి రిపీట్ చేస్తే ఆదరిస్తారా అన్నదే ఇపుడు ఉన్న ప్రశ్న.