Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వజ్రాల బావిలో అంతుచిక్కని రహస్యం

Category : editorial

బావిలో వజ్రాలు ఉన్నాయని వెళ్లారు ఇక అంతే మల్లి తిరిగి రాలేదు , అసలు ఏంటి ఈ కథ ఇంతకీ ఎక్కడ ఉంది ఈ బావి ఏంటి దాన్ని రహస్యాలు. మన మనదేశంలో ఊహకందని విషయాలు ఇప్పటికీ కనిపెట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. అందులో ఈ వజ్రాల బావి ఒకటి చాలా మందికి చాలా విషయాలు తెలుసుకోవాలనే ఆర్తుత ఉంటుంది, అటువంటి అతృతతో ఈ బావిలోకి వెళ్ళినవాళ్ళు ఇప్పటికి తిరిగిరాలేదు. వివరాల్లోకి వెళితే అస్సాం రాష్ట్రంలోని గౌహతి కి కొన్ని కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఒక ఎత్తైన కొండమీద ఈ వజ్రాల బావి ఉంది. అసలు ఈ బావి సహజ సిద్ధంగా ఏర్పడిందా లేక ఎవరైనా నిర్మించారా అనే ఆధారాలు ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఈ విషయం పక్కనపెడితే ఈ బావి గురించి ఒక ప్రాచీన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధిస్తుండగా, అప్పుడు ఇంద్రుడు దతిచ్చి మహర్షి ని ప్రార్థించగా అతడు తన వెన్నుముకను వజ్రాయుధంగా ఇవ్వటం జరిగింది. ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో ఆ రాక్షసునితో యుద్ధం చేస్తుండగా వజ్రాయుధం ఇంద్రుడి చేతినుండి భూమిపైన ఈ కొండ ప్రాంతంలో పడిపోగా, ఇంద్రుడు భూమి పైకి వచ్చి ఆ వజ్రాయుధన్నీ తీసుకొని వృత్తాసురుడు

తలని నరికి వేయగా వజ్రాయుధం పడిన స్థలంలోనే ఈ బావి ఏర్పడిందని ఆ బావిలోనే వృత్తాసురుడు తలపడింది ఒక కథనం ఉంది. ఈ విధంగా వజ్రాయుధంగా ఏర్పడిన ఈ బావి లో వజ్రాలు దొరుకుతాయని తల దాటుకుని వెళితే లభిస్తాయని ఇప్పటి వరకు ఎక్కువమంది సాహసించలేదని అంటారు. ఈ బావి లోకి వెళ్లడానికి మెట్ల మార్గం ఏమీ ఉండదని,కానీ బావిలోకి దిగటానికి బండరాళ్లను ఉంటాయని చూసినవాళ్లు చెబుతారు, అయితే లోపల అసలు ఏముంది అని తెలుసుకోవడానికి కొందరు ప్రయత్నించగా, వారు కనిపించకుండా పోయారు.ఇది తెలిసినప్పటికీ అక్కడ కలెక్టర్ ఈ బావికి పైన ఇనుపకంచెలు వేసి బిగించి బండరాళ్లతో కప్పివేసి బావి లేకుండా పూర్తిగా మూసివేశారు. ఇలా భూమి మీద అంతుచిక్కని రహస్యాలు కి ఎన్నోఉన్నాయి, ప్రతిదానికి ఆత్మగా దైవ సంభూతా చర్యలు చాలానే ఉన్నాయి కొన్ని విషయాలు మానవుడు కనిపెడితే మరికొన్ని విషయాలు మానవుడు ఎప్పటికీ తెలుసుకోలేనంత విధంగా రూపుదిద్దుకున్నాయి.