Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చర్చిపై ఉగ్రదాడి... ఆరుగురు దుర్మరణం

Category : national politics

ప్రపంచ వ్యప్తంగా ఉగ్రదాడులు రోజురోజూ కు పెరిగిపోతున్నాయి, మోన్న భారత్ లో , నిన్న శ్రీలంకలో, నేడు ఆఫ్రీకాలో ఇలా వరస బాంబులతో పేలుళ్లతో ప్రపంచం వణికిపోతుంది, ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

మృతులలో ఒక పాస్టర్, అతని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. మరో ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించలేదు. మధ్యాహ్నం 1 గంట సమయంలో చర్చిలో ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా... ఏడు మోటార్ బైక్ లపై వచ్చిన ఆగంతుకులు వారిపై తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఎంతమంది దాడికి పాల్పడ్డారు అనే విషయంలో క్లారిటీ రాలేదు.

మరోవైపు, దాడికి తామే పాల్పడినట్టు ఇంత వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించుకోలేదు. 2016లో పశ్చిమ ఆఫ్రికాలో జిహాదిస్ట్ హింస చోటు చేసుకున్న తర్వాత చర్చిపై జరిగిన తొలి ఉగ్రదాడి ఇదే. శ్రీలంక తరువాత ఆఫ్రికా బాంబు పేలుళ్లతో మిగతా దేశాలన్నీ ఎలక్ట్ అయ్యాయి, భారత్ లో కూడా ముఖ్యమైన పట్టణాల చర్చిల్లో తనిఖీలు మొదలుపెట్టారు.

Related News