పాకిస్తాన్ టీం యొక్క బ్యాట్స్‌మన్ "బాబర్ ఆజంను" "కుల్దీప్యాదవ్" ఔట్ చేసిన బంతి అత్యుద్భుతమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. బాబర్, ఫకార్ మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారని, కానీ కుల్దీప్ మాత్రం ఈ జోడిని అద్భుతంగా విడగొట్టాడని కోహ్లీ అన్నాడు.అలాగే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కూడా చాలా అత్యద్భుతమని కొనియాడాడు కోహ్లీ. ఆదివారం పాక్‌తో జరిగిన ఈ పోరులో భారత్ 89 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయానంతరం టీం ఇండియా కోహ్లి మాట్లాడుతూ.. ‘మా యొక్క ఇన్నింగ్స్ సగం పూర్తయ్యాక బంతి స్పిన్ తిరగడం మొదలైంది. టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. రోహిత్ మరోసారి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.
రాహుల్ కూడా తాను ఒక ఉత్తమ వన్డే ఆటగాడినని చాటాడు. బాబర్ ఆజమ్‌ను ఔట్ చేసిన కుల్దీప్ బంతి చాలా అద్భుతం. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వాళ్ళు మనల్ని ఓడించారని ఈ మ్యాచ్‌ను అతి భావోద్వేగంతో తీసుకుంటే చేదు ఫలితాలు రావొచ్చు. కాబట్టి అందుకని ఆ ఓటమి గురించి ఏ మాత్రం ఆలోచించలేదు అని అన్నాడు. ఆటలో ఇలాంటివి అన్ని మాములే అని భావించి ముందుకెళ్లాం. దానికి తగ్గ ఫలితమే ఇది అని. తొడకండరాలు పట్టేయడంతో భువనేశ్వర్ కుమార్ రెండు, లేదా మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కానీ మ్యాచ్ కీలక సమయంలో మాత్రం అందుబాటులోకి వస్తాడు’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. క్రెడిట్ భారత బ్యాట్స్‌మెన్‌దే.
టాస్ గెలిచి కూడా ఆ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోయాని పాకిస్తాన్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ యొక్క క్రెడిట్ మొత్తం భారత బ్యాట్స్‌మెన్‌దేనని చెప్పుకొచ్చాడు. ‘ టాస్ అయితే గెలిచాం. కానీ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం అని అన్నాడు. రోహిత్ అద్భుతంగా ఆడాడు. రోహిత్‌కు బాల్ అప్ ప్రణాళిక రచించాము కానీ అది అంత అద్భుతంగా ఏమి పనిచేయలేదు. టాస్ గెలిచిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌తో సమిష్టిగా రాణించింది. మూడు ఓవర్ల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయాం. ఇదే మా కొంప ముంచింది. ఫకార్, ఇమామ్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడారు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ప్రస్తుత పరిస్థితులు మాకు కఠినమే. మేం మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాలి’ అని తెలిపాడు.