//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..!

Category : national

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు చెల‌రేగాయి. కాగా, హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఢిల్లీకి స‌మీపంలోకి చేరుకోగానే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంట‌లు వ్యాపించాయి. ప్యాంట్రీ, ఎస్ -10, వీ-1 బోగీల్లో మంట‌లు చెల‌రేగిన‌ట్టు ప్ర‌యాణికులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది.

మంట‌లు అంటుకున్న బోగీల‌ను రైలు నుంచి వేరు చేయ‌డంతో ప్ర‌యాణికులంద‌రూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని, షార్ట్‌స‌ర్క్యూట్ కార‌ణంగా ఏసీ బోగీల్లో చెల‌రేగిన మంట‌లు ఆ త‌రువాత మిగ‌తా బోగీల‌కు వ్యాపించిన‌ట్టు స‌మాచారం. సంఘట‌న‌కు సంబంధించి స‌మాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ప్ర‌మాదంపై పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.