//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ గవర్నర్ గా సుష్మా స్వరాజ్.... వైరల్ గా మారిన వార్త పై క్లారిటీ ఇచ్చిన సుష్మా.

Category : politics

రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది ఓ వార్త.సోమవారం ఉదయం నుంచి వైరల్ గా మారిన ఈ వార్త పై జాతీయ మీడియా లు సైతం అవాక్కయ్యయి.ఇంతకీ.అసలు విషయం ఏమిటి అంటే.రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లు నియామకం పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఓ వింత ప్రచారం ఊపందుకుంది. దీనికి ఉతం ఇస్తూ.. ఆదివారం సాయంత్రం తిరుపతిలో ప్రధాని మోడీని కలిసిన రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.....ఆ మరునాడు ఉదయం అయ్యేసరికి ఢిల్లీలో ప్రత్యక్షం కావటం విశేషం .. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావటంతో ఏదో జరుగుతుందన్న భావన ప్రతి ఒక్కరి లో కలిగింది.ఇంతలోనే.. ఏపీకి సుష్మా స్వరాజ్ ను గవర్నర్ గా ఎంపిక చేశారంటూ ఓ వార్త బయటకు వచ్చింది.ఇదే విషయాన్ని జాతీయ మీడియా మొదలు.. ప్రాంతీయ మీడియాలలోనూ ఈ వార్తను ప్రముఖంగా చూపించారు. బ్రేకింగుల మీద బ్రేకింగులు కూడా వేశారు. ఈ వార్త కాస్త సుష్మ స్వరాజ్ వరకు వెళ్లడంతో ఖంగుతిన్న ఆమె చివరకు ట్విట్టర్ లో స్పందించారు.తానేదో మర్యాదపూర్వకంగా ఉప రాష్ట్రపతి నీ కలిస్తే.. దానికి ఇలాంటి వార్తలు జోడించి రాయడం సరైన పద్దతి కాదని ఆమె వ్యాఖ్యానించారు.

తాను ఏపీకి గవర్నర్ గా నియమితులైనట్లు వస్తున్న వార్తలన్ని పచ్చి అబద్ధాలంటూ సుష్మ స్వరాజ్ కొట్టిపారేశారు.ఇంతలా ఈ వార్త వైరల్ కావడం వెనుక అసలు కారణం వేరే ఉంది. ఈ తప్పుడు వార్త వ్యాప్తికి కారణం అదే పార్టీకి చెందిన కేంద్రమంత్రి ఒకరు చేసిన పొరపాటే....ఇందుకు కారణం. కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్దన్ చేసిన ఈ తప్పుడు ట్వీట్ తో ఇంత రభసా మొదలైంది. సుష్మను ఏపీకి గవర్నర్ గా నియమించారని.. ఆమెకు అభినందనలు తెలుపుతూ ఆయన చేసిన ఈ ట్వీట్. ఓ లెవల్ లో వైరల్ గా మారింది. దీనిపై వెంటనే తేరుకున్న ఆయన తన ట్వీట్ ఇంకాసేపటికే డిలీట్ చేశారు.అయినప్పటికీ.. ఇది పలు మీడియా సంస్థల కళ్లల్లో పడటంతో.. సుష్మ స్వరాజ్ ఏపి గవర్నర్ అయ్యారోచ్ అన్న వార్తల పరంపర మొదలైంది. ఏపీకి గవర్నర్ గా ఎంపికైన సుష్మ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిశారని.. అదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ భేటీ కావటంతో ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది. చివరకు సుష్మ స్వరాజ్ రంగంలోకి దిగి.. క్లారిటీ ఇవ్వడం తో ఈ వార్త కి తెరపడింది.