Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'సూపర్ డీలక్స్'....సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం చైతూనే

Category : world movies

తాజాగా అక్కినేని సమంత కోలివుడ్ లో నటించిన చిత్రం 'సూపర్ డీలక్స్'.రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.దీంతో ఈ చిత్ర బృందం తమ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.దాని లో భాగంగా ఈ సినిమాలో కీ రోల్ లో నటించిన సమంత కూడా ఈ సినిమా సక్సెస్ ని బాగానే ఆస్వాదిస్తోంది. అక్కినేని సమంత ,నాగ చైతన్య జంటగా నటించిన మజిలీ సినిమా ఈ నెల 5 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ...ఈ సందర్భంగా ఆమెను అడిగిన పలు ప్రశ్నలకు సమాధానము ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 'సూపర్ డీలక్స్' చిత్రంలో బోల్డ్ గా కనిపించే 'వేంబు' పాత్రలో తాను నటించానని. ఈ పాత్రను మొదట ఒప్పుకున్నప్పుడు కాస్త భయపడ్డానని ఎందుకంటే ఇలాంటి పాత్ర చేయడం వల్ల ఎలాంటి విమర్శలు వస్తాయోనని.... అపుడు చాలా కంగారు పడ్డానని. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక తన పాత్రకి మంచి పేరు,గుర్తింపు తో పాటు ..... విమర్శకులకు ప్రశంసలు సైతం దక్కుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా చూసిన వాళ్లంతా నా నటనను మెచ్చుకుంటున్నారని.

ఈ పాత్ర ఇంతటి పేరు తెచ్చిపెట్టడానికి ముఖ్య కారకుడు చైతూ నే అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ పాత్ర గురించి మొదట చైతన్య కి చెప్పినప్పుడు .. ఆయన ఏ మాత్రం కాదు ,కూడదు అనకుండా నన్ను ఆ పాత్ర చేయమని ఎంకరేజ్ చేయడం వల్లనే నాకి పేరు వచ్చింది. అందుకే ఈ సినిమా టోటల్ క్రెడిట్ ఆయనకే చెందుతుందని. అలాగే ఈ సినిమా హిట్ అయిందని తెలియగానే నాగ్ మామయ్య ఫోన్ చేసి మరి అభినందించారు. ఆయన తన కొడుకులిద్దరినీ ఎలా ప్రోత్సహిస్తారో .. నన్ను కూడా ఆ స్థాయిలోనే ప్రోత్సహిస్తారని.అందుకే ఈ విజయం నాకు ప్రత్యేకం .. అని ఆమె తన ఆనందాన్నిప్రేక్షకులతో పంచుకుంది.