//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ 3 ప్రారంభ తేదీని ప్రకటించిన "స్టార్ మా".

Category : movies

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో "బిగ్ బాస్" కార్య‌క్ర‌మం నార్త్‌లో సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి మనకు తెలిసిందే. సౌత్‌లోనూ ఈ కార్య‌క్ర‌మం వ‌రుస సీజ‌న్‌లు జ‌రుపుకుంటుండ‌గా, తెలుగులో సీజ‌న్ 3 జ‌రుపుకునేందుకు ఇప్పుడు సిద్ధ‌మైంది. నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో 16 మంది కంటెస్టెంట్‌లు ఉంటార‌ని తెలుస్తుంది. అయితే వారెవ‌ర‌నేది అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినప్పటికీ వారికి సంబంధించిన ఒక లిస్ట్ మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇక ఈ కార్య‌క్ర‌మం ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఈ వార్త కచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంద‌నే చెప్పాలి.

తాజాగా "స్టార్ మా" ఒక ప్రోమో ద్వారా బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సీజ‌న్ 3 జూలై 21 నుండి టెలికాస్ట్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 24 గంట‌లు, 64 కెమెరాల మ‌ధ్య 16 మంది కంటెస్టెంట్స్ చేసే హంగామాతో ఇక బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఫ‌న్ దొరుకుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బిగ్ బాస్ హౌస్‌లో యాక్టింగ్ కాదు. ఓన్లీ రియాలిటీనే ఉంటుంద‌ని నాగ్ ఈ ప్రోమోలో తెలిపాడు. బిగ్ బాస్ సీజ‌న్ 2 లో నాని హౌజ్‌మేట్స్ చేసే హంగామాని టీవీలో చూపించ‌గా ఈ సారి మాత్రం నాగ్. పండూతో అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటాడ‌ని ఈ ప్రోమో ద్వారా తెలుస్తుంది.