ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ ముఖ్య నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాకుండా జగన్ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ ఇన్ని చేస్తున్న ఎక్కడో వైసీపీలో కాస్త తేడా కొడుతుంది. గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు ప్రజలకు కనబడి మీ సమస్యలు తీరుస్తాం అని చెప్పిన వారు ఇక గెలిచాక ప్రజలకు కనిపిస్తే ఒట్టు.
ఇక ఎన్నికలలో జగన్ ముఖం చూసి వైసీపీకి ఓటేస్తే గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా నేడు పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను గ్రామస్తులు హిందూపురం రహదారిపై అడ్డుకొని అనంతపురం జిల్లా దిగువపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని దానిని తీర్చాలంటూ కోరారు. అయితే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వెంటనే స్పంధించి అధికారులకు ఫోన్ చేసి నీటి సమస్యను తీర్చాలన్నారు. అయితే దిగువపల్లి గ్రామస్తులు ప్రజలు అడ్డుకుని వాదిస్తే తప్పా ఎమ్మెల్యేకి ప్రజల కస్టాలు కానరావడం లేదా అని అంటున్నారట.