Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దక్షిణాది రాష్ట్రాల పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్రం....అందుకేనా గవర్నర్లు తో అమిత్ షా మంతనాలు....?

Category : politics

దక్షిణాది రాష్ట్రాల పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్రం. తాజాగా చూస్తే దక్షిణాది గవర్నర్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం వెనుక అసలు కారణం ఏమిటి. ఇలా ఒక్కొక్కరిగా కలుస్తున్న వేళ.. గవర్నర్ పదవుల్లో మార్పు కోసం కసరత్తు జరుగుతోందన్న ప్రచారం ఓ వైపు మొదలైవుతుంటే. మరో వైపు ఇంకో రకం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారిని పదవి నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించనున్నరనే ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి వారిని తప్పించే ఉద్దేశం ఉంటే వారితో భేటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు.అనే ఆలోచన కూడా రాక మానదు.అంతే కాకుండా కొత్త గవర్నర్ల ఏర్పాటు అంశంపై బాధ్యతారాహిత్యంతో ప్రకటనలు చేస్తున్నారని చెప్పక తప్పదు.ఎప్పుడైనా సరే కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి వద్దకు మర్యాదపూర్వకంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు కలవటం ఆనవాయితీ.అది రాష్ట్ర సమస్యల అవగాహన కు సంబంధించిన భేటీ కూడా అయ్యి ఉండవచ్చు.అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశాల్ని హోం మంత్రి బ్రీఫ్ చేయటం మామూలే అదే రీతిలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సైతం కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దానికి చాటలు కట్టేసి.. ఏదేదో జరిగినట్లుగా వార్తలు తెర మీదకు రావటం తెలిసిందే.

రీసెంట్ గా నరసింహన్ తో పాటు మరి కొందరు గవర్నర్లు ఆయనను కలవగా.. తాజాగా మరో ఐదు రాష్ట్రాల గవర్నర్లు అమిత్ షాతో భేటీ అయ్యారు. షాను కలిసి వారిలో పశ్చిమబెంగాల్ గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ.... జార్ఖండ్ గవర్నర్ ద్రైపది ముర్ము..తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్... అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా తదితరులు భేటీ అయ్యారు. అయితే ఈ నేపధ్యంలోనే ఓ కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. సుష్మా స్వరాజ్ లాంటి సీనియర్ నేతను ఒక బుల్లి రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపిక చేస్తారని ఎలా అంచనా వేస్తారు....? తక్కువలో తక్కువ ఉప రాష్ట్రపతి పదవి కంటే తక్కువ పదవి తీసుకోవటానికి ఆమె ఇష్టపడదు ..అలాంటిది గవర్నర్ గిరిని ఎందుకు తీసుకుంటారు.ఈ చిన్న లాజిక్ ను మిస్ అయిన సదరు కేంద్ర మంత్రి .. ఆమెను ఏపీ గవర్నర్ గా నియమించారని.. అభినందనలు చెబుతూ ఓ పోస్ట్ చేయటం.. ఆ తర్వాత నాలుక కర్చుకొని డిలీట్ చేయడం గమనార్హం.ఇలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారే ఇలా వ్యవహరిస్తే మామూలు వారి సంగతేంటి...? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.