//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మీ ఆరోగ్యం కోసం కొన్ని గృహవైద్యాలు

Category : health editorial

1. బి పి తగ్గడానికి , బరువు తగ్గడానికి , చలవ చేయడానికి , మలబద్ధకం తగ్గడానికి ప్రతిరోజూ ఆనపకాయ జ్యూస్ త్రాగండి

2. మీ షుగర్ తగ్గడానికి చిన్న కాకర కాయ , ఒక టమాటో , సగం ముక్క కీర దోసకాయలను మిక్సీలో వేసి వచ్చిన జ్యూస్ త్రాగండి

3. మీకు సయాటికా నొప్పి ఉంటె పారిజాతం ఆకుల కషాయం త్రాగండి

4. మీకు నడుమునొప్పి, మోకాలు నొప్పి ఉంటె శోంఠీ , మెంతులు , పసుపు లను పొడి చేసి ఆ మిశ్రమాన్ని ఉదయం , సాయంత్రం వేడినీళ్ళతో పాటు పూటకు అరచెంచా చొప్పున వేసుకుని త్రాగండి

5. మీ నడుము సన్నబడి బొజ్జ తగ్గాలి అంటే పసుపు , మిరియాలు, దాల్చిన చెక్క , అల్లం లను ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి అరగ్లాసు అయ్యే వరకూ మరిగించి ఆ కషాయం త్రాగండి .

6. నిద్ర పట్టడం లేదు అనుకుంటే రాత్రి పడుకునే ముందు రెండు ముక్కులలోనూ 5 - 5 చుక్కలు ఆవునెయ్యి వేసుకోండి

7. సైనస్ కూ, మైగ్రేన్ కూ కూడా ఇదే వైద్యం చేసుకోండి

8. ఆస్తమాకు పాలల్లో పసుపు వేసుకుని త్రాగండి

9. బరువు తగ్గాలి అంటే ప్రతి రోజూ గోధన్ ఆర్క్ 20 - 40 మిల్లీ లీటర్లు అయిదు రెట్ల నీళ్ళల్లో వేసుకుని ఉదయం త్రాగండి

10. ఆశ్వగంద ఆకులు ప్రతిరోజూ రోజుకు ఒకటి చొప్పున తిని వేడినీరు త్రాగితే నెలకు మూడు కిలోల బరువు తగ్గుతారు .

11. ABC జ్యూస్ : ఒక ఆపిల్ , ఒక బీట్ రూట్ , ఒక కేరట్ లను మిక్సీలో వేసి ప్యూరీ గా చేసి ( గుజ్జు ) దానిని మీ ఉదయపు ఆహారం గా తీసుకోండి . అలా తినే టైం ఉండదు అనుకుంటే జ్యూస్ త్రాగండి . ఇది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచే ఒక సరికొత్త ఉపాయం .