Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యాంకర్ సుమ రెమ్యునరేషన్ పై రాజీవ్ కనకాల హాట్ కామెంట్స్...ఆ డబ్బు ఏం చేస్తుందో కూడా తనకు తెలిదట...?

Category : movies

తెలుగులో ఎంతో మంది యాంకర్లు ఉన్నప్పటికీ..వారందరిలో టాప్ యాంకర్ ఎవరూ అంటే మాత్రం సుమ కనకాల అనే అంతా చెబుతారు.ఈ విషయంలో మరో ఆలోచనే లేదు. వెండి తెర సూపర్ స్టార్ లు ఎందరు ఉన్నా..! బుల్లితెర పై యాంకర్ల లో లేడి సూపర్ స్టార్ మాత్రం ఒక్కరే ఆమె యాంకర్ సుమా కనకాల..గత పది, పదిహేను ఏళ్లుగా తెలుగు లో బుల్లి తెర యాంకర్ గా తన స్థాయి కి మించిన పేరు , గుర్తింపు తెచ్చుకున్న సుమా ఉపటివరకు కొన్ని వేల షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అంతే కాకుండా ఇండియాలోనే ఏ యాంకర్ చేయలేనటు వంటి అన్ని తరహా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి గిన్నిస్ రికార్డ్ లో సైతం చోటు సంపాదించుకుంది. స్వతహాగా సుమా మలయాళీ అమ్మాయి అయిన..ఆమె చిన్న నాటి నుంచి ఇక్కడే ఉండటంతో తెలుగు భాషపై మంచి పట్టు ఉంది.

ఆమె యాంకరింగ్ చేస్తుంటే సినిమా మన కళ్లముందు ఆ సినిమా కనిపిస్తున్నట్టే ఉంటుంది. సినీ పరిశ్రమలో అందరి గురించి ఆమెకు ఎంతో అవగాహన ఉంది. ఓ వైపు టెలివిజన్ రంగం లో యాంకరింగ్ చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తుంది. తాజాగా 'మహర్షి' సక్సెస్ మీట్ లో మహేష్ సైతం సుమకి స్పెషల్ థాంక్స్ చెప్పారు. అంటే ఆమె క్రేజ్ ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న సుమ కు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తారో అని అందరూ అనుకుంటున్నారు..అంతే కాదు సుమ కు కొంత మంది స్టార్ హీరోయిన్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ వస్తుందని ఆ మద్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఆమె భర్త రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సుమకి ఉన్న టాలెంట్, ఆమె పనితనమే తనను టాప్ ప్లేస్ లో ఉంచిందని...ఎప్పుడు కూడా ఇది నాకు రాదు అని వెనక్కి తగ్గిన సందర్భాలు ఎప్పుడూ ఎదురు కాలేదని అన్నారు. సుమ వరుస షోలు, కార్యక్రమాల్లో కనిపిస్తుంది కాబట్టి ఆమె చాలా సంపాదించేస్తుందని అందరూ అనుకుంటున్నారని..

కానీ దాని వెనుక చాలా కష్టం కూడా ఉందని అన్నారు. షూటింగ్ లో నటీనటులు లైట్ల మధ్య ఐదు నిమిషాలు నిల్చొని ఒక షాట్ చేయడమంటే అబ్బో అని తెగ ఫీల్ అవుతుంటారు..కానీ కొన్ని వందల లైట్ల మధ్య ఎనిమిది, తొమ్మిది గంటలు నిల్చొని షోలు చేస్తున్న సుమ మాత్రం అలసిపోయినా ఆ భాద తన ముందు కనిపించకుండా ఉంటుంది..ఆమె కష్టం నేను అర్థం చేసుకుంటాను. ఇన్నేళ్లుగా ఆ కష్టాన్ని భరిస్తూ పని చేసుకుంటూ వస్తోన్న సుమ నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అయితే సుమ యాంకరింగ్ చేసి చాలా డబ్బు సంపాదిస్తుందనే భావనలో ఉంటారు చాలా మంది..కానీ అలాంటిది ఏమీ లేదు. అంతే కాదు సుమ ఎంత సంపాదిస్తోందనే విషయాలను తను ఎప్పుడూ తెలుసుకోవాలని ప్రయత్నించలేదని..భార్యగా ఆమె స్థానానికి నేను ఎంతో గౌరవం ఇస్తానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.