//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే ఆర్‌కే రోజా..

Category : politics state

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినేట్‌లో తనకు చోటు దక్కకపోవడంతో ఆమె కినుక వహించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. పలు సమీకరణల కారణంగా మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నానని కీలక పదవిని అప్పగిస్తామని సీఎం జగన్‌ ఆమెకు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆమెను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అదే సమయంలో.. తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) స్పెషల్‌ ఆఫీసర్‌గా ఏవీ ధర్మారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్ కు చెందిన ధర్మారెడ్డి టీటీడీ స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు ఆ తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ధర్మారెడ్డి బుధవారం వరకు కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. టీటీడీ జేఈవోగా తిరిగి రావాలన్న ఆయన కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో కేంద్రం ఆయన డిప్యుటేషన్‌ను అంగీకరిస్తూ బుధవారమే రిలీవ్‌ చేసింది. ఆ వెంటనే ఆయన అమరావతికి వచ్చి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేశారు. కాగా ఆయనను టీటీడీ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ తిరుమల జేఈవో నిర్వహిస్తున్న బాధ్యతలను ఆయన నిర్వహిస్తారని ఆ జీవోలో పేర్కొన్నారు.