//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు కారణం ఆయనేనా..?

Category : business national

చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ బీ ఆర్‌ బాలకృష్ణన్‌. ఈయన 1983 బ్యాచ్‌ కి చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి, కాగా బుధవారం నాడు బీ ఆర్‌ బాలకృష్ణన్‌ పదవీ విరమణ చేశారు. ఆయనకు రిటెర్మెంట్‌ రోజే ఒక షాకింగ్‌ న్యూస్‌ చేరింది. కాఫీ కింగ్‌ వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు కారణం ఆయనేనన్న వార్త చక్కర్లు కొట్టింది. సిద్ధార్థ తన చివరి లేఖలో 'ఓ ఐటీ శాఖ డీజీ తనను వేధించినట్లు, అన్యాయంగా ఆస్తులు జప్తు చేసి వ్యాపారం జరక్కుండా అడ్డుకున్నట్లు' పేర్కొన్నారు. అయితే ఆ అధికారి బాలకృష్ణనే, దీంతో ఆయన పేరు ఇపుడు దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఐటీ శాఖ అధికారులు వాస్తవానికి బాలకృష్ణన్‌ పనిగట్టుకుని వేధించిన సందర్భాలు లేవని, తన వృత్తి నిర్వర్తించి, ప్రభుత్వ విధానాలను అమలు చేసారని చెబుతున్నారు.

ఇక ఇపుడు దృష్టంతా కేంద్రం పాటిస్తున్న విధానంపైకి మళ్లింది. వాళ్ళు ముక్కుపిండి పన్ను వసూళ్లు చేయడం, ఆస్తుల జప్తు మొదలైనవి ఎంతవరకూ కర్రెక్టున్న చర్చ జరుగుతోంది. సిద్ధార్థ వాణిజ్యవేత్తగా తాను విఫలమయ్యానని రాసి ఉండొచ్చు. కానీ నిజానికి కంపెనీని చాలాకాలం పాటు ఆయన విజయవంతంగానే నడిపారు. ఏ కంపెనీలోనైనా ఆర్థిక ఒడిదొడుకులు సహజం. కానీ ప్రభుత్వ విధానమనేది సహకరించేలా ఉండాలి తప్ప కంపెనీని మూసివేసేటట్లుగా ఉండకూడదు.

సిద్దార్థ విషయమే చూడండి ఆయన 50వేల మందికి ఉద్యోగాలిచ్చారు. మంచి కంపెనీ.. ప్రజల ఆదరణ కూడా పొందిన సంస్థ, ఆ కంపెనీతో ఇబ్బందులుంటే వాటిని సవరించేందుకు, దానిని నిలబెట్టేందుకు ప్రభుత్వం తోడ్పడాలి. ఓ కార్పొరేట్‌ సంస్థ ప్రతినిధి విధానపరంగా కొన్ని మార్పులను తీసుకురావాలి అని అభిప్రాయపడ్డారు. వారిని వెంటాడి వేటాడరాదు. అంతే కాదు ఇన్నేళ్లూ సదరు పరిశ్రమాధిపతి ఆర్థికవృద్ధికి, ఉపాధి కల్పనకు సహకరించినదంతా పోయినట్టేనా? కొంత వెసులుబాటు ఇవ్వడం సరైన పద్ధతి అని ఓ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

ఇలా కొందరు ఈ విషయం పై స్పందించారు. అలానే ఆర్థికమాంద్యం, వేరే కారణాల వల్ల కొన్ని కంపెనీలు సరిగా పనిచేయలేకపోవచ్చు. అపుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆదాయపు పన్ను విధానాన్ని కేంద్రం మరింత పదునుదేల్చింది. బ్రిటన్‌లో అనుసరించిన "కనెక్ట్‌" అనే విధానాన్ని మార్గదర్శకంగా తీసుకుని కొత్త వ్యవస్థను రూపొందించింది. అంతేకాకుండా ఇందుకోసం ప్రత్యేక పర్యవేక్షక యంత్రాంగం ద్వారా అందరూ పన్ను చెల్లించేలా చూడాలని నిర్ణయించింది.