//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యాంటీ అబార్షన్ లా-HB 314'ను వ్యతిరేకిస్తూ ....తన న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి నిరసన తెలిపింది ఓ హీరోయిన్.

Category : world

మన దేశంలో ఏ సమస్య తలెత్తిన, ఏ ప్రభుత్వం యెక్క పని తీరు పై నిరసన వ్యక్తం చేయాలి అన్న చాలా మంది, చాలా విధాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు.అందులో కొందరు అర గుండు ప్రదర్శన, అర్ధ నగ్న ప్రదర్శన, మౌన ప్రదర్శన వంటి ఎన్నో రకాల నిరసనలు మన వారు ఎంచుకుంటు ఉంటారు. కానీ ఓ విదేశీ భామ మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంది.తాను నిరసన వ్యక్తం చేసిన తీరును చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు వివరాల్లోకి వెళితే....అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన 'యాంటీ అబార్షన్ లా-HB 314'ను వ్యతిరేకిస్తూ ఓ ప్రముఖ మోడల్ రాటజ్‌కోవ్స్‌కి(27) పూర్తి నగ్న ప్రదర్శనతో తన నిరసన వ్యక్తం చేసింది. అబార్షన్ స్ పై మహిళల సొంత నిర్ణయానికి అవకాశం లేకుండా చేసే ఈ చట్టం వల్ల వారి హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన నగ్న ఫోటోను పోస్ట్ చేసి మరీ తన నిరసన వ్యక్తం చేసింది.

అబార్షన్‌ను నిషేధించాలని ఈ వారం 25మంది శ్వేత వర్ణ పురుషులు తమ ఓటు వేశారు. ఇది అమలులోకి వస్తే.. రక్త సంబంధీకులతో సంభోగం, అత్యాచారాలకు గురైన సందర్భాల్లో వచ్చే ప్రెగ్నెన్సీని కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉండదు.అబార్షన్ నిషేధం కోసం ఓటేసినవారు తమ అభిప్రాయాలను, ఉద్దేశాలను మహిళల శరీరాలపై రుద్దుతున్నారు. ఏ స్టేట్స్ అయితే అబార్షన్‌ను నిషేధించాలని భావిస్తున్నాయో....! అక్కడ నల్లజాతి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది రేసిజంతో ముడిపడి ఉన్న సమస్య. ఇది మానవ హక్కులపై దాడి చేయడమే.తమ శరీరాలు తమ ఇష్టమని....! స్త్రీలకు వారి శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని రాటజ్‌కోవ్స్‌కి అన్నారు. కానీ అబార్షన్ నిషేధం వంటి చట్టాల ద్వారా స్త్రీలు తమ శరీరంపై హక్కులను కోల్పోతారని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... మహిళల అభిప్రాయాలను, హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆమె తనదైన రీతిలో విజ్ఞప్తి చేసింది.