Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రచ్చ చేస్తున్న రష్మిక మందన్న హాట్ వర్కౌట్స్.....ఈ వీడియో చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే.....!

Category : movies

రష్మిక మందన్న ప్రస్తుతం ఈ పేరు తెలియని సౌత్ ప్రేక్షకులు ఉండరేమో ....అంతలా ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తుంది.అయితే తాజాగా ఈ అమ్మడిని సినిమాలలోనే కాదు సోషల్ మీడియా లోనూ రష్మిక ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజరోజుకీ పెరిగిపోతుంది. తెలుగు లో టాప్ హీరోయిన్స్ చాలానే ఉన్న ప్రస్తుతానికైతే ఈ అమ్మడి ఫాలోయింగ్ ముందు వారంతా దిగ దుడుపే అని చెప్పుకోవాలి. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తరువాత ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి మేస్మరైజ్ చేసింది.

ఈ సినిమాలో రష్మిక, విజయ్ ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ కావడం తో వీరిది మంచి హిట్ కామీనేషన్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు ఈ సినిమాలో విజయ్ తో చేసిన రొమాన్స్ తో కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టయానే చెప్పాలి. ఆ తర్వాత నాని సరసన ‘దేవదాస్’ సినిమాలో తన దైన నటనతో ఆకట్టుకుంది.ప్రస్తుతం రష్మిక మందన్న ..విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఈ విజయ్‌తో చేసిన లిప్‌లాక్‌పై పెద్ద దుమారమే నడుస్తోంది. దాంతో పాటు ‘ఛలో’ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమాలో నటిస్తోంది. అంతేకాదు ఇపుడు ఏకంగా మహేష్ బాబు, అనిల్ రావిపూడి సినిమాలో కథానాయికగా ఛాన్స్ పట్టేసింది. ఇలా వరుస అవకాశాలతో దూసుకు పోతున్న ఈ అమ్మడు.

కేవలం నటనతోనే నెట్టుకు రాకుండా ఆన్ని విభాగాల్లోనూ తన దైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తుంది.అందుకే కేవలం లిప్‌లాక్‌లు, గ్లామర్ షోలతో ఆడియన్స్‌కు కైపెక్కించడం మానేసిన రష్మిక మందన్నా.. ఈ మద్యన తన వర్కౌట్స్‌తో కూడా అభిమానులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. తాజాగా ఈ భామ దివంగత రియల్ స్టార్ శ్రీహరి చేసినట్లుగా జిమ్నాస్టిక్స్ చేస్తుంది. అప్పట్లో శ్రీ హరి గారు బ్యాక్ ఫల్టిలు కొట్టడంలో ఎంతో నిష్ణాతులు.అయితే తాజాగా రష్మిక కూడా అలాంటి కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల హృదయల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది.అందుకే చెమటలు కక్కెల వర్కౌట్ చేస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న విన్యాసాలు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది.

Related News