//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రామ్ చరణ్ రఫ్ లుక్ అదుర్స్...!

Category : movies

నిన్న ముంబైలో రామ్ చరణ్ సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీని కలవడం జరిగింది. బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో ఇద్దరు అక్కడున్న ఫోటో గ్రాఫర్లకు ఫోజ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఇటీవల విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ "వినయ విధేయ రామ" చిత్రంలో కియారా అద్వానీ నటించారు. ఆ సినిమా లో వీరిద్దరూ రొమాంటిక్ కపుల్ గా అలరించారు.

ఇక ముంబై వెళ్లిన రామ్ చరణ్ కియారా ను కాజ్వల్ గా కలవడం జరిగింది. ఇటీవల కియారా అద్వానీ నటించిన అర్జున్ రెడ్డి మూవీ హిందీ రీమేక్ "కబీర్ సింగ్" ఘనవిజయం సాధించింది. కియారా ఇప్పుడు రెండుకు పైగా హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ తాజా లుక్ ఆసక్తికరంగా మారింది.

బాగా మెలితిప్పిన మీసంలో రామ్ చరణ్ రఫ్ లుక్ లో చాలా బాగున్నాడు. రాజమౌళి తీస్తున్న "ఆర్ ఆర్ ఆర్" చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి చరణ్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో మన్యం వీరుడు రామరాజు పాత్ర చేస్తున్న చరణ్ ఆ రోల్ కొరకు కోర మీసం పెంచినట్లున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ లుక్ చూసి అభిమానులు చాలా సంతోష పడుతున్నారు.