//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రౌడీ అంటే ఆ హీరోయిన్ కి చాలా ఇష్టం ఇష్టమట..!

Category : movies

సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ తెలియని వారు ఉండరు. మలయాళం "ఒరు ఆదార్ లవ్" అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ లో కన్ను గీటే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో "వింక్ గర్ల్" గా పాపులర్ అయింది. తెలుగులో ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ "లవర్స్ డే" పేరుతో రిలీజ్ అయినా ఫ్లాప్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రియ తాజాగా తన ఇన్స్టా అకౌంట్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి కెమెరాకు పోజిచ్చింది. ఆ ఫోటో కొత్తది ఏమీ కాదు, డియర్ కామ్రేడ్ షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలాగా అనిపిస్తోంది. ప్రియా ఈ ఫోటోకు వారియర్ "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ కన్నుగీటు భామ వాలకం చూస్తుంటే, విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్టులలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసి పెడుతున్నట్టుగా అనిపిస్తోంది కదా. ప్రస్తుతం ప్రియ "శ్రీదేవి బంగ్లా" అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.