//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ సాహో న్యూ స్టిల్ అదిరిందిగా...!

Category : movies

ప్రభాస్ "సాహో" విడుదలకు ఇంకా కొన్ని రోజులే ఉండటం వలన చిత్ర ప్రొమోషన్స్ పై ఫోకస్ పెట్టినట్టున్నారు. ఈ నేపథ్యం లోనే ఆయన సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసేపనిలో పడ్డారు. అందుకనుగుణంగా సినిమా సాంగ్ టీజర్స్ తో పాటు, పోస్టర్స్,స్టిల్స్ విడుదల చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. ఇక నిన్న "సాహో ది గేమ్" పేరుతో ఓ వీడియో గేమ్ త్వరలో రాబోతుందని హిన్ట్ ఇచ్చిన ప్రభాస్ ఈ రోజు ఉదయాన్నే ఆ మూవీ లోని ఓ స్టైలిష్ స్టిల్ షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసారు.

స్టైలిష్ స్టిల్ లో లెథర్ జాకెట్ ధరించి స్మైలీ లుక్ తో హీటేక్కిస్తున్నారు. ప్రభాస్ ఈ ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి, దానికి కాప్షన్ గా న్యూ స్టిల్ అని పెటారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ నటిస్తుండగా, ఆమెపై కూడా కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని డైరెక్టర్ సుజీత్ చిత్రీకరించారు. అయితే ఇప్పటికి కూడా ప్రభాస్ రోల్ పై స్పష్టత లేదు. ఇక ట్రైలర్ లో నైనా ప్రభాస్ పోలీసా, లేక పోలీస్ లకు చుక్కలు చూపించే సూపర్ దొంగా అనేది తెలుస్తుందేమో చూడాలి మరి.