Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ నీ పెళ్ళిచేసుకోవాలని దేశంలోని అమ్మాయిలంతా చూస్తున్నారట.....ఈ విషయాన్నే ఓపెన్ చేసిన తమన్నా.

Category : movies

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని పరిశ్రమలో అందరూ డార్లింగ్ అని పిలుస్తారు.ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రభాస్ గురించి మిల్కీ బ్యూటీ అతడి సన్నిహితులు.. స్నేహితుల కంటే ఎంతో గొప్పగా వర్ణించి చెప్పింది. ఒకప్పుడు ఎంతో మంది అమ్మాయిలు ప్రభాస్ ని పెళ్లాడాలని వేచి చూసేవారు.కానీ అది బాహుబలి సినిమాకి ముందు మాట. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత దేశంలోని అమ్మాయిలంతా తనని పెళ్లాడాలని ఆశపడ్డారనీ...! చెబుతూ డార్లింగ్ ప్రభాస్ ని ఆకాశానికెత్తేసింది.ఐదేళ్ల పాటు తెరకెక్కించిన బాహుబలి 1 - 2 సినిమాల కోసం అనుష్క - తమన్నా ఇద్దరూ కూడా ఆ సినిమాలో ఎంతగానో కష్టపడి వర్క్ చేశారు. అందుకే ఆ సమయంలో ప్రభాస్ ఉన్న సాన్నిహిత్యం,స్నేహం వారి మద్య మరింత అనుబంధాన్ని పెంచింది.దీంతో ఈ విషయంలో ప్రభాస్ గురించి ఆ ఇద్దరికీ కాకుండా ఇంకెవరికి అంత బాగా తెలుస్తుంది. పైగా డార్లింగ్ ప్రభాస్ సరసన రెబల్ లాంటి బారీ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.

అందుకే ప్రభాస్ గురించి ఎన్నో రహస్యాలు తను ఓపెన్ చేయగలదు. ఈ సంధర్బంగా ప్రభాస్ ఎంతో సాఫ్ట్. దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తి అని. కింగ్ వంటి వాడని చెప్పుకొంచింది. నిజంగా తమన్నా చెప్పినట్టే ప్రభాస్ కింగ్ లాంటోడే....! మనసున్న మారాజే. అతడంటే దేశవ్యాప్తంగా ఉన్న మగువలు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ప్రస్తుతం సాహో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగస్టు 15 తర్వాత తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం ఇంటర్నేషనల్ లెవల్ కి పెరుగుతుందేమో. ఇన్నాళ్లు దేశంలోని అమ్మాయిలు మాత్రమే అతడిని పెళ్లాడాలనుకున్నారు. సాహో రిలీజైతే అది హాలీవుడ్ రేంజు కాబట్టి దేశ- విదేశాల్లో సైతం ప్రభాస్ కి మరింత క్రేజ్ పెరగనుంది. ఇక ఈ దెబ్బతో అమ్మాయిలంతా అతడినే పెళ్లాడాలనుకుంటే పరిస్థితేంటి....? అన్నది వేచి చూడాలి. అన్నట్టు.. డార్లింగ్ పెళ్లి విషయంలో ఇన్ని సంగతులు చెప్పింది కదా.. అతడి విషయంలో తమన్నా ఒపీనియన్ ఏంటో...? చెబితే కోస్టార్ ఎవరైనా కంగారు పడతారని అనుకుందా....? పెదనాన్న పెళ్లి చేసేస్తానని వెంటపడినా నేడు - రేపు అని తప్పించుకుంటున్న డార్లింగ్ కనీసం సాహో తర్వాత అయినా పెళ్లి చేసుకుంటాడా అన్నది చూడాలి.

Related News