//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

Category : movies

చాలా రోజుల తర్వాత పవర్ స్టార్, మెగాస్టార్ కలిశారు. వీరు కలిస్తే ఎప్పుడూ చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. అభిమానులకు కనుల పండగే.చిరంజీవి-పవన్ కల్యాణ్ కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

ఆయనతో పాటు పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. భేటీకి కారణం తెలియకపోయినా.. అభిమానులు మాత్రం ఆనందిస్తున్నారు.మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా'.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.