//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"ప్లే బ్యాక్" మరో త్రిల్లర్ మూవీనా..?

Category : movies

ఈమధ్య కాలంలో తెలుగు సినిమా కథల్లో కొత్తదనం కనిపిస్తోంది. ఇది మంచి విషయమే. న్యూట్యాలెంట్ ప్రతిసారీ అవే కథల్ని తిప్పి తిప్పి తీసే కల్చర్ కి చెక్ పెటింది. అ!, అర్జున్ రెడ్డి, జెర్సీ, మజిలీ ఇవన్నీ ఈ తరహా ప్రయత్నాలే. ఇక మునుముందు ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుందా ? అంటే అవుననే అనిపిస్తోంది.

హరి ప్రసాద్ జక్కా అనే కొత్త కుర్రాడు తాజాగా ఎంచుకున్న కాన్సెప్ట్ ఆసక్తిని రేపింది. 1993 లోని అమ్మాయి 2019 లోని అబ్బాయితో ఫోన్ లో కనెక్ట్ అయితే ? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మా "ప్లే బ్యాక్" సినిమా కథ అంటూ క్యూరియాసిటీ పెంచారు. ఆగస్టు 5న సినిమాని ప్రారంభిస్తున్నారు.

పి.ఎన్.కె.ప్రసాద్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ వినేందుకు ఆసక్తికరంగానే ఉంది. అయితే తీసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఇప్పుడు ప్లేబ్యాక్ చిత్రం థ్రిల్లర్ ఫార్మాట్ లో వచ్చినా లైన్ పరంగా కొత్తదనం కనిపిస్తోందన్న ముచ్చట మీడియాలో సాగుతోంది.