పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్లో ఆచితూచి అడుగులు వేస్తున్న పాయల్ ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలని సెలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. ఇక పోతే పాయల్ డిస్కోరాజా చిత్రంలో రవితేజ సరసన కథానాయికగా నటిస్తుండగా, వెంకీ మామ చిత్రంలో వెంకటేష్‌తో జోడీ కట్టింది.
ఇప్పుడు ప్రస్తుతం ఆర్డీఎక్స్ అనే చిత్రం చేస్తుంది. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం నాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఉంటుందని సమాచారం. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ఇందులో పాయల్ లుక్ అభిమానులను మాయ చేసేలా ఉంది.