Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం......జగన్ ప్రమాణ స్వీకారానికి పవన్ హ్యాండ్.

Category : state politics

ఏమో ఇప్పుడు ఇవే వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారోత్స‌వం ఘ‌నంగా జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు వైసీపీ నేత‌లు. మే 30న జరగబోయే ఈ వేడుక కోసమే విజ‌యవాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం కూడా అంగ‌రంగ వైభ‌వంగా ముస్తామ‌వుతుంది. అక్క‌డే ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నాడు వైఎస్ వార‌సుడు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఈ వేడుక‌కు ఎవ‌రెవ‌రు వ‌స్తున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.ఈ ప్ర‌మాణ స్వీకార వేడుక‌కు ప‌లువురు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌తో పాటు చంద్ర‌బాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది. బాబుకు స్వ‌యంగా జ‌గ‌న్ ఫోన్ చేసి ఈ వేడుక‌కు రావాల‌ని ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా ఈ ఆహ్వానం అందిందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే అన్ని పార్టీల‌తో పాటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా ఓ ఆహ్వానం అందింద‌ని.. అయితే దీనికి జ‌న‌సేనాని మాత్రం రావ‌డం లేద‌ని తెలుస్తుంది.జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీక‌ర మ‌హోత్స‌వానికి ప‌వ‌ర్ స్టార్ దూరంగా ఉండ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ వేడుక త‌ర్వాత ప్ర‌త్యేకంగా వెళ్లి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప‌వ‌ర్ స్టార్ క‌లుస్తాడ‌ని.. అంతేకానీ ప్ర‌మాణ స్వీకారానికి మాత్రం జ‌న‌సేన అధినేత రావ‌డం లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికితోడు ఇంత‌కు ముందు ప‌వ‌న్, జ‌గ‌న్ పెద్ద‌గా క‌లిసిన దాఖ‌లాలు లేవు.