//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓ బేబీ చిత్రం సమంత జీవితాన్నే మార్చేసిందా ?

Category : movies

జీవితంలో ఏ నటీనటుడికైనా గుర్తుండిపోయే చిత్రాలంటూ కొన్ని ఉంటాయి. అలానే ముద్దు గుమ్మ సమంత కు కూడా తన జీవితంలో మరచిపోలేని సినిమా "ఏం మాయచేసావే". తెలుగులో ఈ చిత్రం సమంతను నటిగా సుస్థిరత స్థానాన్ని కల్పించడంతో పాటు, తనకు జీవిత భాగస్వామినే అందించింది. ఇక ఆ తరువాత పలు కమర్షియల్‌ చిత్రాలు తమిళం, తెలుగు భాషల్లో చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఇప్పుడు తను తాజాగా నటించిన ఓబేబీ చిత్రం సమంతకు మరో స్థాయిని కల్పించింది. అదే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకి స్థాయి. ఒకప్పుడు అనుష్కకు ఓ అరుంధతి, నయనతారకు ఓ మాయ, ఇప్పుడు అరమ్‌ చిత్రాల లాగా సమంతకు ఓ బేబీ మైలురాయిగా నిలిచి పోతుంది. సమంతనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఓ బేబీ చిత్రం తన జీవితానికి సంబంధించిన నిర్ణయాన్నే మార్చుకునేలా చేసింది అని వెల్లడించింది.

సమంత తెలుగు నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తరువాత కూడా కథానాయకిగా తన క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తోంది. ఎప్పుడు తన గ్లామరస్‌ ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది ఈ భామ. ఇకపొతే సమంత ఓ బేబీ చిత్రం తరువాత తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత సమంత వచ్చే ఏడాది తల్లి కావాలని నిర్ణయించుకుందనే ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేలా సమంత తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. 96 చిత్రం తరువాత తాను నటించనున్న కొత్త చిత్ర వివరాలను త్వరలోనే చెప్తానంది. సమంత ఇకపై కథానాయకికి ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఓ బేబీ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందన్న మాట.