Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'ఓ బేబీ' టాక్.. ఏడ్చేసిన సమంత!

Category : movies

సమంత నటించిన కొత్త చిత్రం 'ఓ బేబీ' ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి మార్కింగ్ షో నుండే సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. విమర్శకులు, ప్రేక్షకులు సినిమాలో సమంత నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎక్కడా నెగెటివ్ టాక్ లేదు. ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీటిని చూసిన సమంత ఓ వెబ్‌సైట్ అయితే సమంత వల్లనే ఈ విజయం సాధ్యమైందంటూ రాసింది. దీనికి సమంత రిప్లై ఇస్తూ.. ఈ రివ్యూ చదివి నేను ఏడ్చేశా.

ఇది నేను కష్టపడి పనిచేసేందుకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఓ మీడియా సంస్థ సామ్ అదరగొట్టేసింది అని రాయగా.. దానికి సామ్‌.. ఇప్పుడు ఇంటికెళ్లి నిద్రపోతా. ధన్యవాదాలు అంటూ స్పందించారు. తమిళ స్టార్ ధనుష్ కూడా ఓ డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేసి ఇది ఓ బేబీ యూనిట్ చిత్ర బృందం ఫీలింగ్ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. కొరియన్ చిత్రం మిస్ గ్రానీకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి తెరకెక్కించారు.