//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నూతన విధానాలు.... పాలనలో టీడీపీ నీ మరిపిస్తున్న కొత్త సీఎం

Category : state politics

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గతం లో ఎన్నడూ లేని విధంగా 150 కి పైగా అసెంబ్లీ,21 పార్లమెంట్ స్థానాల్లో విజయ డం కా మోగించిన వైసీపీ.అధికార పార్టీ టీడీపీని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపధ్యంలోనే ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం సైతం చేయడం...రాష్ట్ర పాలనలో తనదైన శైలిలో దూసుకుపోతు ఉండడం విశేషం. అధికారం చేపట్టిన వెంటనే బదిలీలు, కొంతమంది అధికారులపై వేటుతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆయన.తనకు అన్ని విధాల సహకరించే సరి కొత్త టీమ్‌ను రెడీ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు, పాలన వ్యవహారాలపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తూనే. అందులో భాగంగా నేటి నుంచి శాఖలవారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖలపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు. ఆదివారం విద్యాశాఖ, జలవనరులశాఖలపై సమీక్షలు చేయనున్నారు.

4వ తేదీ నుంచి వ్యవసాయ వాటి అనుబంధ రంగాలపై, గృహ నిర్మాణశాఖపై సీఎం సమీక్షలు జరుపుతారు. 6న సీఆర్డీయేపై సమీక్షలు జరపనున్నారు.కాగా, నేటి సమీక్షకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థిక, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా, శుక్రవారం అక్షయపాత్ర ట్రస్ట్ నిర్వాహకులతో సమావేశమైన జగన్.. మధ్యాహ్న భోజన అమలు తీరుపై వారిచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను విన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. ఇన్ని రకాలుగా అధికారం చేపట్టిన అతి తక్కువ రోజుల్లోనే తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్.ముందుగా ఆయన చెప్పినట్లు మొదటి ఆరు నెలల వ్యవధిలోనే మన సీఎం అనిపించు కునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.