Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్- పాక్ "మౌకా-మౌకా'’ యాడ్ పై..... తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.....!

Category : sports

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత రసవత్తరమైన మ్యాచ్ లుగా పేర్కొంటారు భారత్- పాక్ మ్యాచ్ అంటే. అంతటి ప్రేక్షకాదరణ తో పాటు దాయాది దేశాల మధ్య ఏళ్ల నాటి వైరం కూడా ఈ మ్యాచుల్లో కనిపిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ లకు అంతలా ఆదరణ.అందుకే ఈ మ్యాచ్ లకు భారీ గా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి.అటు ఐసీసీ.. ఇటు ప్రసార హక్కులు పొందిన ఛానెల్స్. ఇందుకోసం ఎప్పుడూ పోటీ జరిగిన వాటి నుంచి కోట్లకు కోట్లు ఖాతాలో వేసుకోవడంలో ఈ సంస్థలు ఏపుడు ముందు ఉంటాయి. అందుకే ఇలా ఒక్కో మ్యాచ్కు ఐసీసీ టికెట్ ధరలను భారీగా పెంచుతూ వస్తోంది. ఇక మ్యాచ్ హక్కులు పొందిన చానెల్ అయితే - యాడ్స్ రూపంలో భారీగా లాభాన్ని వెనకేసుకుంటున్నాయి..

అందుకే భారత్ - పాక్ మ్యాచ్ అనగానే మరి ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ మ్యాచ్ జరగడానికి కొద్దిరోజులు ముందు నుంచే టీవి ఛానెల్స్ కొత్త కొత్త యాడ్స్ ప్లే చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా రూపొందిందే ‘మౌకా-మౌకా’ యాడ్ఈ యాడ్ గత కొన్నేళ్లుగా ఎంతో ఫేమస్ అయ్యిందనే చెప్పాలి.భారత్ - పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం స్టార్ స్పోర్ట్స్ చానెల్ గతంలో ‘మౌకా-మౌకా’ అనే యాడ్ రూపొందించింది. ఇది గత కొన్నేళ్లుగా సందర్భాన్ని బట్టి మారుతూ వచ్చింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్ ను ఉద్దేశించి సదరు ఛానెల్ మరో యాడ్ ను రూపొందించింది. అయితే ఈ సారి మ్యాచ్ కి ముందు ఫాదర్స్ డే జరగనున్న నేపథ్యంలో దీనికి ఆ తరహా డైలాగులు కలిపి వదిలారు. దీంతో ఈ యాడ్ కొద్ది సమయంలోనే మరింత వైరల్ గా మారిపోయింది. గతంతో పోలిస్తే ఇందులో మరింత అతి కనిపిస్తోంది.

దీంతో ఇరు దేశాలకు చెందిన నెటిజన్లు ఈ యాడ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక యాడ్ విషయానికి వస్తె ఇప్పటి వరకు పాక్ - భారత్ చేతిలో అంతర్జాతీయ వేదికలపై ఆరు సార్లు ఓటమి పాలైంది. 1992 నుంచి వరుసగా ఆ జట్టు ఓడిపోతూనే వస్తుంది. 1992, 1996 ,1999 , 2003, 2011, 2015 ఇలా భారత్ తో పాక్ డీ కొట్టిన ప్రతిసారి ఆ జట్టుకు ఓటమే దక్కింది. ఇలా అన్నింటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. 2007 ప్రపంచకప్ లో మాత్రం రెండు జట్లు వేరు వేరు గ్రూపుల నుంచి తలపడి - అదే దశలో ఇంటికి వెళ్లిపోయాయి. గత ఫలితాలను గుర్తు చేసుకుంటూ చెప్పిన డైలాగులతో రూపొందించిన ‘మౌకా-మౌకా’ యాడ్ పై సెటైర్లు తీవ్ర స్థాయిలో పేలుతున్నాయి. దీన్ని రూపొందించిన స్టార్ స్పోర్ట్స్ చానెల్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.