//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేరేడుపండ్లు తింటే ఎన్ని ప్రయోజనాలో ...?

Category : editorial health

సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం.సమ్మర్‌లో ఎక్కువగా లభించే ఫ్రూట్స్‌లో నేరేడు ఒకటి.. వీటిలో ఆరో్యానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే ఈ పండ్లని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు.నేరేడుపండు ఆరోగ్యానికి మంచిది. ఔషధగుణాలు కల్గిన చెట్టు అది. ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్‌ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్‌ 15, ఐరన్‌ 1.2, విటమిన్‌ సి 18మి.గ్రా. ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. నేరేడులో ఉన్న ఆవ్లుగుణంవల్ల దీన్ని జామ్‌లు, వెనిగర్‌, సాండీస్‌, ఆల్కహాల్‌, తక్కువశాతం ఉండే వైన్‌ల తయారీలో వాడుతుంటారు.

ఉపయోగాలు :

(1)నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.

(2 )నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55mg ల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.

(3 )నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది.

(4 )వేసవిలో వేడి వాతవరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. అలాగే దప్పికను కంట్రోల్ చేస్తుంది.నేరేడు పండ్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి, శరీరంలో ఎముకలు బలంగా ఉండేదుకు సహాయపడుతుంది

(5 ) నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుంటాయి. ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి. నేచురల్ గా బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేసే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నేరుడు పండ్లలో ఉండే విటమిన్ సి గౌట్ పెయిన్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.