Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మేజర్‌ "అజయ్‌కృష్ణ" గా మహేష్ బాబు..!

Category : movies

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు". ప్రస్తుతం కశ్మీర్‌లో ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను టీమ్‌ హైదరాబాద్‌లో ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ఇందులో మహేశ్‌బాబు "మేజర్‌ అజయ్‌కృష్ణ"గా నటిస్తున్నారని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌లో ఆపరేషన్‌ మొదలైందని, 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా, విజయశాంతి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.