Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరోసారి "దూకుడు" చూపించబోతున్న మహేష్ బాబు..!

Category : movies

మరొక రెండు రోజుల్లో, అనగా ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం రానుండడంతో అప్పుడే మహేష్ బాబు అభిమానులు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సందడి మొదలెట్టేసారు. ఇక నిన్న, మహేష్ బాబు బర్త్ డే "కామన్ డిస్ప్లే పిక్చర్" ని ప్రస్తుతం మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాను నిర్మిస్తున్న అనిల్ సుంకర చేతులమీదుగా మహేష్ ఫ్యాన్స్ రిలీజ్ చేయించారు. ఇక మరోవైపు ఆయన జన్మదినం రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రక్తదానాలు, అన్నదానాలు వంటి సామజిక కార్యక్రమాలు జరిపేలా ప్లాన్ చేసిన మహేష్ ఫ్యాన్స్ కు మరింత బూస్ట్ ని ఇచ్చేందుకు ఇప్పటికే చెన్నైలోని ఒక ప్రముఖ థియేటర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "బిజినెస్ మాన్" సినిమాని ఆగష్టు 9న ఒక స్పెషల్ షో వేయనున్నట్లు ప్రకటించింది.

ఆ షో టికెట్స్ ఇప్పటికే హాట్ కేకులు అమ్ముడవుతున్నాయట. అలాగే హైదరాబాద్ లో మహేష్ బాబు నెలకొల్పిన ఏఎంబి సినిమాస్ వారు ఆగష్టు 9న దూకుడు సినిమా స్పెషల్ షో ప్రదర్శిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన ఆ సినిమాను మహేష్ జన్మదినం నాడు, అది కూడా ఏఎంబి సినిమాస్ లో చూడడం కోసం మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా ఆసక్తి చూపుతూ టికెట్స్ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. రెండు రోజుల్లో రానున్న మహేష్ బర్త్ డే నాడు ఆయన అభిమానులు ఇంకెంత సందడి చేయనున్నారో చూడాలి మరి.