//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ స‌ర్కార్‌కు మ‌హిళా రైతు స‌వాల్‌..!

Category : state politics

వైఎస్ఆర్ కాంగ్రెస్ స‌ర్కార్‌కు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళా రైతు స‌వాల్ చేసింది. గ‌త కొన్ని రోజులు గత టీడీపీ ప్ర‌భుత్వం ముంపు ప్రాంతానికి అమ‌రావ‌తి అని పేరుపెట్టి రాజ‌ధానిని క‌ట్టాల‌ని చూసింద‌ని, ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టికీ ప‌నుల‌న్నీ పెండింగ్‌లో ఉండిపోయాయంటూ మున్సిప‌ల్‌శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. బొత్స వ్యాఖ్య‌ల‌కు వైసీపీలోని అత్య‌ధిక‌శాతం మంది మ‌ద్ద‌తు కూడా తెలిపారు. మ‌రోప‌క్క టీడీపీ, బీజేపీలు బొత్స వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ వ‌స్తున్నాయి. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లం చేకూర్చేలా ఉంది.

కాగా, బీజేపీ నేత‌లు మంగ‌ళ‌వారం నాడు అమ‌రావ‌తి ప్రాంత రైతులతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో బ‌త్తుల భ‌వాని అనే మ‌హిళా రైతు మాట్లాడుతూ సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు. తాను ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి అమ‌రావ‌తి ప్రాంతంలో నివాసం ఉంటున్నాన‌ని, ఎన్నోమార్లు వ‌ర‌ద‌లు వచ్చినా క‌ర‌క‌ట్ట‌కు ఆనుకుని ఉన్న ప్రాంతం ఏనాడు ముంపుకు గురి కాలేద‌ని తేల్చి చెప్పింది. 2009, 2019 సంవ‌త్స‌రాల్లో మాత్ర‌మే కృష్ణాన‌ది ప‌క్క‌నే ఉండ‌టం కార‌ణంగా వ‌ర‌ద వ‌చ్చింద‌ని, కానీ ఆ స‌మ‌యాల్లో రాజ‌ధాని ప్రాంతం మాత్రం వ‌ర‌ద ముంపుకు గురి కాలేద‌ని వెల్ల‌డించింది. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పిన‌ట్టు అమ‌రావ‌తి ప్రాంతం ముంపు ప్రాంతంగా నిరూపించ‌గ‌లిగితే తన‌కు త‌న పుట్టింటి వారు ఇచ్చిన మూడున్న‌ర ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వానికి రాసిచ్చేస్తానంటూ స‌వాల్ చేసింది.