ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం ఒక్క ఏపీ రాజకీయ వర్గాల్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద చిచ్చు పెట్టేలా ఉందని ఇప్పుడు ఏపీ ప్రజలే భయపడుతున్నారు. కాగా ఇక్కడి ఉద్యోగాలకు కేవలం స్థానికులకు మాత్రమే అర్హులని రాష్ట్ర ప్రజలే రాష్ట్రంలో ఉద్యోగాలకు చెయ్యాలని ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వకూడదని జగన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దిశలోనే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏం అనగా, కర్ణాటక ఉద్యోగాలు అక్కడ కన్నడిగులకే చెందాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయట.
అయితే దీనికి మద్దతుగా ప్రముఖ సినీ నటుడు ఉపేంద్ర కూడా మద్దతుగా ఈ ఆగష్టు నెల 14,15 తారీఖుల్లో జరగబోయే ఉద్యమానికి మద్దతుగా కూర్చోనున్నారారని కూడా తెలుస్తుంది. ఇక దీనితో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన తెలుగు వారు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఉద్యమానికి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని ఒకవేళ ఇదే కానీ జరిగితే అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు చేసుకోవాలని జగన్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇక జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి మరి.