ఇండియన్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నరా? అంటే అవుననే తెలుస్తోంది. ఇద్దరూ ఓ అవేర్ నెస్ ప్రొగ్రాం కోసం కలిసి పనిచేయబోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎన్ డీటివి ఓ అవేర్ నెస్ ప్రొగ్రామ్ ను నిర్వహించనుంది. అందులో భాగంగా తారక్, కొహ్లీ లను సంప్రదించగా చేయడానికి అంగీకరించారు. వీరిద్దరితో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 7గురు సెలబ్రిటీలు కూడా ప్రచారకర్తలుగా పనిచేయనున్నారు.
త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.విరాట్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తే అతని క్రేజ్ విశ్వ వ్యాప్తం అవుతుంది. కొహ్లీ అంటే ప్రపంచ క్రికెట్ లో ఓ బ్రాండ్. అలాంటి దిగ్గజం పక్కన తెలుగు స్టార్ నటించడం అంటే అదృష్టం కలిసిరా రావాలి. ఆ చాన్స్ తారక్ కి వచ్చింది. ఈ అవేర్ నెస్ ప్రోగ్రాంతో తారక్ నేషనల్ లెవల్లో మంచి గుర్తింపు దక్కుతుంది. ఆ గుర్తింపు తన ప్రొఫెషనల్ కెరీర్ కు బాగా కలిసొస్తుంది. ఇక తారక్ రోడ్డు ప్రమాదాల గురించి తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు వాయిస్ ఓవర్ రూపంలో చెబుతూనే ఉంటాడు. ఆ విషయంలో టాలీవుడ్ లో హీరోలందరిలో తారక్ ప్రత్యేకం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.