//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ రెండు పార్టీలకు చుక్కలు చూపిస్తున్న జనసేన...ఆ జిల్లా రాజకీయాల్లో పవన్ మ్యానియా బీభత్సం....?

Category : state politics

ఏపీ లో ఏప్రిల్ 11 న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోల్ అయిన ఓటింగ్ పర్సెంట్ గత ఎన్నికల కంటెను అధికంగా నమోదైనట్లు ఇప్పటికే తెలుస్తుంది.అయితే ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు తమదంటే తనదంటూ ఎవరికి వారు తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో పార్టీ అధినేతల నుంచి కీలక నాయకులు, కార్యకర్తల వరకు ఎవరికి వారు తమ పార్టీ గెలుపు పై కాలర్ ఎగేరేస్తున్నారు.ముఖ్యముగా ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఈ రకమైన ఖచ్చితత్వం వెనుక అసలు కారణం ఏమిటి అంటే...ఓ వైపు ఎన్నికల ముందు వైపీసీ అధినేత ప్రచారం లో భాగంగా తాము అధికారంలోకి వస్తే నవరత్నాల పేరిట అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పుకు రావడం.ఈ పథకాల పై ప్రజల్లోనూ పూర్తి విశ్వాసం ఉండడంతో ఆ పార్టీ గెలు పై వారు తమ ధీమా వ్యక్తంచేస్తున్నారు.

అలాగే ఏపి రాజకీయాల్లో మరో బలమైన పార్టీ అయిన టీడీపి సైతం ఈ సారి ఎన్నికల్లో తమదే గెలుపు అంటూ బల్లగుద్ది చెబుతున్నాయి. ఇంత ధీమా వెనుక అసలు కారణం తాము అధికారంలో ఉండగా ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలే తమను మళ్లీ అధికారంలో కూర్చో బెడుతుందని....ముఖ్యంగా వారు మహిళల కోసం ప్రవేశ పెట్టిన పసుపు - కుంకుమ పథకం పై వారు భారీ అంచనాలే పెట్టుకున్నారు . అంతే కాకుండా టీడీపి లో తమ పార్టీ నాయకుల కంటెను కార్యకర్తలే చాలా బలంగా ఉన్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం చెప్పుకు రావడం. తాము అమలు చేసిన మంచి పనులే తమకు శ్రీ రామ రక్షా అంటూ అధినేత సరళిలో కొత్త స్వరం చూస్తూ ఉంటే వారి గెలుపుపై గట్టి నమ్మకమే కనిపిస్తుంది. అలాగే తాజాగా నెల్సన్ సర్వేలోనూ టీడీపి భారీ మెజారిటీ తో గెలవబోతుందని చెప్పడం.అలాగే వైసీపీ కి గతంలో వచ్చిన సీట్లే మళ్లీ రిపీట్ అవుతాయని.ఇక జనసేన పార్టీ కి రెండు అంకెల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఈ సర్వేలో వెల్లడి కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొన్నది.

ఈ రెండు పార్టీలది ఒక దారి అయితే ఇక జనసేన పార్టీ ది మరో దారి. రాజకీయాల్లో నూతన మార్పులు తీసుకురావడమే ధ్యేయంగా అవతరించిన జనసేన... యువతను రాజకీయాల వైపు ఆకర్షించే విధంగా.... వారిలోనీ నూతన శక్తి నీ ప్రజా సమస్యల పై పోరాడే విధంగా ఆ పార్టీ సిద్ధాంతాలు నెలకొల్పబడ్డాయి.అందుకే ఆ పార్టీ పై ఇప్పటి యువతలో ను మంచి ఆదరణ లభిస్తుంది.అలాగే ఎన్నికల ముందు నుంచి జనసేన ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో పని చేస్తూ ఉండడం. ఉద్ధానం కిడ్నీ సమస్య అయితేనేం,కాకినాడ ఎస్సీ జెడ్ల సమస్యలు అయితేనేం, రాజధాని నిర్మాణం లో భూములు కోల్పోయిన రైతుల సమస్యలు అయితేనేం.ఇలా ఒకటా రెండా అనేక సమస్యల పై నిత్యం పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా ఆ పార్టీ కి కలిసొచ్చే అంశం.అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీ భారీ అంచనాలే పెట్టుకుని మరి బరిలోకి దిగింది.

ఇది ఇలా ఉంటే ఏపి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించే మూడు జిల్లాల్లో ప్రధాన పార్టీల ఎత్తుగడలు ఫలించెలా మాత్రం లేదు. గత ఎన్నికలలో టీడీపి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అయిన ఉమ్మడి గోదావరి జిల్లాలు,ఈ సారి ఎన్నికల్లో ను మరో మారు తన మార్క్ రాజకీయాలు చూపించ బోతున్నాయి.ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ జిల్లాలో ముందు నుంచి జనసేన పార్టీ కి ఆయువు పట్టుగా ఉంటూ వస్తున్నాయి.కానీ ఈ సారి ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం అటు వైసీపీ, ఇటు టీడీపి పార్టీ లకు కూడా సమానంగా లేదా పోటా పోటీ వాతావరణాన్ని సృష్టించ బోతున్నయి.అంతే కాకుండా ముందు నుంచి ఈ రెండు జిల్లాల్లో జనసేన తన భారీ బలాన్ని మరో సారి చూపించ బోతున్నది.కావున జనసేన దెబ్బకు ఆయా పార్టీల పోటీ అభ్యర్థులకు వెన్నులో వొణుకు మొదలైంది.

ఇక పోతే ఈ ఎన్నికల పై భారీ అంచనాలే నెలకొన్నాయి..గతంలో జరిగిన ఎన్నికల తో పోల్చుకుంటే ఈ సారి ఎన్నికలు కాస్త ఒత్తిడి వాతావరణమే సృష్టిస్తున్నాయి.అంతే కాకుండా ఈ సారి ఓటింగ్ పర్సెంట్ కూడా భారీ గా పెరగడం అందులో అధికంగా మహిళ ఓటర్లే ఉండడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఎందుకంటే మహిళ ఓటింగ్ హే ఈ ఎన్నికల్లో కీలకం కానుంది.ఇప్పటికే ముగిసిన ఓటింగ్ లో భారీ స్థాయి లో సైలెంట్ ఓటింగ్ జరగగా అది ఏ పార్టీ కి అనుకూలిస్తుంది అనేదే అందరిలో ఉన్న ప్రశ్న.ఇక పోతే ఇంత ఒత్తిడి వాతవరణానికి ముఖ్య కారణం ఎవరంటే అది జనసేన పార్టీనే అని చెప్పవచ్చు. అలాగే ఈ సారి జరిగిన ఎన్నికలు సైతం కేవలం వైసీపీ వర్సెస్ టీడీపి పార్టీ ల మధ్యే కాదు....ఈ పోటీ లో జనసేన కూడా ప్రధాన పోటీ నీ ఇవ్వడం జరిగింది.మొత్తానికి ఇది త్రిముఖ పోటీ గా పేర్కొనవచ్చు.కావున ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని కంటే ఏ పార్టీ ఎన్ని సీట్ల తేడాతో ఓడిపోతుంద నేదే అందరిలో ఆసక్తి కలిగిస్తుంది .ఈ లెక్క అంతా తేలాలి అంటే మాత్రం మే 23 వరకు వేచి ఉండక తప్పదు.