//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐ.సీ.సీ వరల్డ్ కప్ ఫీవర్ లో ఇండియన్ సెలబ్రిటీస్..... ఇండియా- పాక్ మ్యాచ్ లో దర్శనమిచ్చిన రకుల్ ప్రీత్, ఉపాసనా.

Category : sports

ఐపిల్ టోర్నీ ముగిసిందో లేదో .... ఐ.సీ.సీ ప్రపంచ కప్ స్టార్ట్ అయిపోయింది. ఇంకేం ఉంది క్రీడా అభిమానులకు పండగ స్టార్ట్ అయిపోయింది.మరి ముఖ్యంగా క్రికెట్ ను ఆరాధించే భారతీయుల కు మరో దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ వచ్చినంత పనైంది. ఇంగ్లాండ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఈ మెగా టోర్నీలో ఎన్నెన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. క్రికెట్ లోనే రసవత్తరమైన మ్యాచ్ గా చెప్పుకునేది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచు.ఇందులో భాగంగానే నిన్న మాంచెస్టర్ లో వరల్డ్ కప్ లీగ్ లో భాగంగా ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ చూసేందుకు గాను సాధారణ ప్రేక్షకుల నుంచి టాప్ ఫిల్మ్, స్పోర్ట్స్, బిజినెస్ పర్సన్స్ పెద్ద సంఖ్యలో ఇంగ్లాండ్ చేరుకున్నారు.ఎంతైనా చిరకాల ప్రత్యర్ధుల మధ్య వరల్డ్ కప్ సమరం అంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఉన్నత ఆసక్తి, అంతకు మించి న ఉత్కంఠ తప్పని సరి.అందుకే ఇలాంటి బిగ్ ఫైట్ చూసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా బిగ్ బిగ్ స్టార్స్ ఈ మ్యాచ్ నీ లైవ్ లో చూసేందుకు ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ క్రికెట్ గ్రౌండ్ లో ప్రత్యక్షం అయ్యారు. ఇక తాజగా చూస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కి హాజర్ అయిన సంగతి తెలిసిందే.

ఇక పోతే నిన్న జరిగిన ఈ మ్యాచ్ కోసం టాలివుడ్ మోస్ట్ బ్యూటీ ఫుల్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన స్నేహితులతో కలిసి ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చింది. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య సందడి చేస్తూ ఈ భామ దిగిన ఫోటోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.ఈ మ్యాచ్ కోసం రకుల్ తో పాటు మరో టాప్ సెలబ్రిటీ మంచు లక్ష్మి, అలాగే రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం రావడం విశేషం. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ తో ఇండియా మరో సారి పాకిస్థాన్ ను మట్టి కరిపించింది. ఇలా ఐ.సీ.సీ మెగా టోర్నీలో పాక్ ఇండియా చేతిలో ఓడిపోవడం ఇది 7 సారి కావడం విశేషం.