భారత్‌తో "ఆర్టికల్ 370 రద్దు" అంశంపై ఏకాకిగా మారిన పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తన నిర్ణయాన్ని పాక్ పున: సమీక్షించుకోవాలని భారత్ సూచించింది. ఆర్టికల్ 370 అనేది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, భారత్‌తో సన్నిహిత సంబంధాలను తెంచుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదని విదేశాంగ శాఖ బదులిచ్చింది. విదేశాంగ శాఖ పాక్ ఇకనైనా దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించింది. పాకిస్తాన్ అనవసరంగా కశ్మీర్ విషయంలో తలదూర్చాలని చూస్తోందని విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది.
పాకిస్థాన్ జమ్మూ కశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దు పై, ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు భారత్ తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షం, అక్రమమని పేర్కొంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హై కమిషనర్ అజయ్ బిసారియాను బహిష్కరించింది. ఇక అలాగే, ఢిల్లీలో ఉన్న తమ దౌత్యవేత్త మొయిన్-ఉల్-హక్‌ను ఇంకా విధుల్లో చేరకముందే వెనక్కి రావాల్సిందిగా ఆదేశించింది.