//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జబర్దస్త్ లో నటించే వీరి సంపాదన తెలిస్తే ...... సినిమా హీరోలే ముక్కున వేలేసుకుంటారు తెలుసా....?

Category : movies

బుల్లి తెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన టీవి షో ఏమిటి అంటే ఇట్టే చెప్పేయొచ్చు అది జబర్దస్త్ అని.అంతలా తెలుగు ప్రేక్షకులకు అతి దగ్గరైన కామెడీ షో జబర్దస్త్. ప్రస్తుతం ఈ కామెడీ షో గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.అంతే కాకుండా ఈ కామెడీ షో ద్వారా నటుడు నాగ బాబు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు అలాగే మరో నటి రోజా కూడా....సినిమాల అనంతరం రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎమ్మెల్యేగా ఉంటూనే జబర్దస్త్ కామెడీ షో లో జడ్జెస్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరవుతు వచ్చారు ఈ ఇద్దరు. అయితే జబర్దస్త్ వంటి కామెడీ షోకి జడ్జీలుగా ఉంటూనే అటు సినిమాల్లోనూ నటిస్తూ ఎంతో బిజీగా ఉంటూ వస్తున్నారు నాగబాబు. ఈ కామెడీ షో కి 2013 నుండి ఇప్పటిదాకా జడ్జిగా ఉంటూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ లో నటించే నటులలో ఎప్పటి నుంచి ఓ రూమర్ వినిపిస్తున్నాయి.

అదేమిటి అంటే ఇందులో నటించే నటీనటులకు,ఆంకర్స్ కి, జడ్జిస్ కి ఎంత రెమ్యునరేషన్ ఉంటుందా ...ఒక్కో ఏపీసొడ్ కి ఎంత తీసుకుంటారా అన్నది అందరిలో ఉన్న ఆసక్తి.అయితే ఒక్కో ఏపి సొడ్ కి నాగబాబు ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటారు. అంటే నెలకు ఎనిమిది లక్షలకు పైగా సంపాదిస్తారు అన్న మాట. అలాగే మరి జడ్జ్ అయిన ఎమ్మెల్యే రోజా కూడా ఒక్కో ఏపి సోడ్ కి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది.అంటే ఆమె కూడా నెలకు ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.అంతే కాకుండా జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంది ఆర్టిస్టులకు పని కల్పించడమే కాకుండా ఎంతో మంది జీవితాల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో దోహద పడుతుంది.ఒక పక్క జబర్దస్త్ వంటి కామెడీ షో లో పనిచేస్తూనే మరో పక్క బిజీబిజీగా సినిమాల్లోనూ నటిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడి ఆర్టిస్టులు.

ఇక జబర్దస్త్ లో నటించే ఆర్టిస్టుల పారితోషికం ఎంతో తెలిస్తే మీరు షాక్ అవాల్సిందే. ఇక తమదైన అందా చందాలతో చిన్న సైజ్ సినిమానే చూపించే యాంకర్స్ రష్మి, అనసూయలు సైతం ఒక్కో ఏపి సోడ్ కి 2 నుంచి 4 లక్షలు తీసుకుంటారు.ఈ లెక్కన నెలకు సుమారు 16 నుంచి 20 లక్షలు వారి ఖాతాల్లో వేసుకుంటున్నారు.ఇక ఈ విషయంలో ముందుగా చెప్పుకోవలసిన నటుడు సుడిగాలి సుదీర్ జబర్దస్త్ ద్వారా వచ్చిన నేమ్ ఫేమ్ తో ఎంతో పాపులర్ అయిన సుధీర్.ఓ పక్కన జబర్దస్త్ చేస్తూనే మరో పక్క సినిమాలు ఇతర షోల్లో యాంకర్ గా పని చేస్తు రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ముందుగా జబర్దస్త్ షో లో ఒక్కో ఏపిససోడ్ కి 2 నుండి 3 లక్షల తీసుకుంటున్నాడు. అలాగే ఇతర షోస్ లో యాంకర్ గా చేస్తూ నెలకు సుమారుగా 25 నుండి 35 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.అలాగే మరో సూపర్ క్రేజ్ ఉన్న మరో నటుడు హైపర్ ఆది.

ప్రస్తుతం ఆది చేస్తున్న ఒక్కో స్కిట్ సూపర్ పాపులర్ అవుతున్నాయి. దాంతో హైపర్ ఆది జబర్దస్త్ లో ఒక్కో షో కి నాలుగు నుండి ఐదు లక్షలు తీసుకుంటున్నాడు మొత్తం మీద నెల వచ్చే సరికి సుమారు 18 నుండి 20 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.ఇక మరో సీనియర్ నటుడు చమ్మక్ చంద్ర ఒక్కో షో కి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటాడు.దాంతో చమ్మక్ చంద్ర నెలకు 16 లక్షల వరకు సంపాదిస్తాడు.అలాగే ఆటో రామ్ ప్రసాద్ ఒక్కో షో కి లక్ష నుంచి లక్షన్నర తీసుకుంటూ నెలకు ఎనిమిది నుంచి పది లక్షలు సంపాదిస్తాడు. రాకెట్ రాఘవ ఒక్కో షో కి 3 లక్షల వరకు తీసుకుంటు సుమారు నెలకు 15 లక్షల వరకు సాధిస్తాడు.ఇక గెటప్ శ్రీను సైతం ఒక్కో షో కి ఒకటి నుంచి రెండు లక్షలు తీసుకుంటూ పది నుంచి పన్నెండు లక్షలు సంపాదిస్తూ దర్జాగా రాయల్ లైఫ్ అనుభవిస్తున్నారు.అలాగే అటు సినిమాల్లోనూ నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు.