//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అంతరిక్ష కేంద్రంలో హాలిడే.పర్యాటకులకు అనుమతి.ఒక రాత్రికి అద్దె 24 లక్షలు - నాసా

Category : technology business

అంతరిక్ష టూర్‌కు వెళ్లాలన్న ఆసక్తి ఉంటే,వారిని పెట్టే బేడా సర్దుకొని సిద్ధంగా ఉండమంటోంది అమెరికా స్పేస్ ఏజెన్సీ "నాసా".2020 నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌) ను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతిస్తామని తాజాగా ఆ సంస్థ ప్రకటించింది.ఐఎస్‌ఎస్‌లో ఉండాలంటే ఒక రాత్రికి అద్దె రూ.24 లక్షలు.వాణిజ్య,పర్యాటక అవసరాలకు ఐఎస్ఎస్‌ను వినియోగించుకునేందుకు అవకాశమిస్తామని నాసా పేర్కొంది.ఏటా రెండు ప్రైవేటు అంతరిక్ష యాత్రలు జరుగుతాయని "ఐఎస్ఎస్" డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గటెన్స్ తెలిపారు.అమెరికన్ వ్యోమనౌకల్లో వెళ్లే ప్రైవేటు వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో 30 రోజుల వరకూ అక్కడ ఉండొచ్చని నాసా పేర్కొంది.

మునుపెన్నడూ లేని రీతిలో వాణిజ్య పరమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నాసా సిద్ధమైందని సంస్థ ముఖ్య ఆర్థికాధికారి జైఫ్ డెవిట్ అన్నారు.ఈ ప్రైవేటు అంతరిక్ష యాత్రలను స్పేస్ ఎక్స్,బోయింగ్ సంస్థ అంతరిక్షయాన సంస్థలు చేపట్టనున్నాయి.వ్యోమనౌకలో సిబ్బంది, ప్రైవేటు వ్యోమగాములకు వైద్యపరంగా,శిక్షణపరంగా అర్హతలన్నీ ఉండేలా చూసే బాధ్యత పూర్తిగా ఆ సంస్థలదేనని నాసా పేర్కొంది.ఐఎస్‌ఎస్‌లో ఉండటానికన్నా.అక్కడికి వెళ్లి,వచ్చేందుకే ఖర్చులు భారీగా అవుతాయి.నాసా వ్యోమగాములకైతే స్పేస్‌ఎక్స్,బోయింగ్ సంస్థలు ఒక్కో వ్యోమనౌక ప్రయాణానికి రూ.416 కోట్ల వరకూ తీసుకుంటుంటాయి.ప్రైవేటు ప్రయాణికులకు కూడా ఇదే రీతిలో ప్రయాణ ఛార్జీలు ఉండవచ్చు.గతంలో ఐఎస్‌ఎస్‌ను వాణిజ్య అవసరాలకు వాడకుండా నాసా నిషేధం అమలు చేసింది.నిజానికి ఈ స్టేషన్ నాసాది కాదు.

1998 నుంచి రష్యాతో కలిసి దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు.ఐఎస్‌ఎస్‌ వాణిజ్యపరమైన వినియోగం విషయంలో కొన్ని దశాబ్దాలుగా రష్యా సుముఖంగానే వ్యవహరిస్తోంది.2001లో అమెరికన్ వ్యాపారవేత్త "డెనీస్ టిటో" తొలి అంతరిక్ష పర్యాటకుడిగా రికార్డు సృష్టించారు.ఎనిమిది రోజులపాటు ఐఎస్ఎస్‌లో గడిపి తిరిగివచ్చారు.ఈ యాత్ర కోసం ఆయన రష్యాకు రూ.138 కోట్లు చెల్లించారు.ఐఎస్ఎస్ పూర్తి ప్రైవేటీకరణ దిశగానే నాసా ఈ తాజా నిర్ణయం తీసుకుంది.ఈ స్పేస్ స్టేషన్‌కు 2025 కల్లా నిధులను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు "డోనాల్డ్ ట్రంప్" గతేడాది బడ్జెట్‌లో పిలుపునిచ్చారు.2024 లో చంద్రుడి పైకి అంతరిక్షయాత్ర చేపట్టాలని ప్రణాళికలు రచించినట్లు ఇటీవలే నాసా ప్రకటించింది.తొలిసారిగా చంద్రుడిపైకి ఓ మహిళను తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించింది