Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హ్యాట్రిక్ విజయం అందుకున్న కోహ్లీసేన...

Category : sports

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. సీజన్ సెకండాఫ్‌లో పుంజుకున్న బెంగళూర్ తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 17 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సిబి 202 పరుగులు చేసింది. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయిన డివీలియర్స్ 44 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు.

ఛేజింగ్‌లో ధాటిగా ఆడిన పంజాబ్ కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుంది. అయితే చివర్లో మిల్లర్, పూరన్ భారీ షాట్లతో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చినప్పటకీ… బెంగళూర్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో పంజాబ్ 185 పరుగులే చేయగలిగింది. తాజా విజయంతో కోహ్లీసేన పాయింట్ల పట్టికలో కింది నుంచి ఒక స్థానం పైకి చేరింది.