//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు.

Category : editorial

<a class="md-inline-link" href="https://ins.media/praise-of-sri-panchamukha-hanuman" target="_blank" rel="noopener noreferrer"> హైదరాబాద్: గురు పౌర్ణమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. షిరిడీలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాయి నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

పుష్ప, దీపాలంకరణలతో సాయిబాబా ఆలయాలు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. సాయిబాబాను దర్శించడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్నారు. మహారాష్ట్రలో కొలువైన షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున వరుసకట్టారు. సాయినామస్మరణతో పలు ఆలయాలు మార్మోగుతున్నాయి.